ధనుష్‌ హీరోగా శేఖర్‌ కమ్ముల సినిమా షురూ | Director Sekhar Kammula New Movie With Hero Danush | Sakshi
Sakshi News home page

ధనుష్‌ హీరోగా శేఖర్‌ కమ్ముల సినిమా షురూ

Published Tue, Nov 29 2022 12:27 AM | Last Updated on Tue, Nov 29 2022 7:45 AM

Director Sekhar Kammula New Movie With Hero Danush - Sakshi

ధనుష్‌ హీరోగా శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో మూడు భాషల్లో తెరకెక్కనున్న సినిమా షురూ అయింది. నారాయణ్‌ దాస్‌ కె. నారంగ్‌ ఆశీస్సులతో శ్రీ వెంకటేశ్వర సినిమాస్‌ ఎల్‌ఎల్‌పీ, అమిగోస్‌ క్రియేషన్స్‌పై సునీల్‌ నారంగ్, పుస్కూర్‌ రామ్మోహన్‌ నిర్మిస్తున్న ఈ సినిమా సోమవారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.

‘‘తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఏకకాలంలో ఈ చిత్రాన్ని నిర్మించి, విడుదల చేస్తాం. వివిధ భాషలకు చెందిన ప్రముఖ నటీనటులు, అగ్రశ్రేణి సాంకేతిక నిపుణులు మా సినిమా కోసం పని చేయనున్నారు’’ అని చిత్రయూనిట్‌ పేర్కొంది. ఈ చిత్రానికి సమర్పణ: సోనాలి నారంగ్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement