పొలిటికల్‌ డ్రామా షురూ | Sakshi
Sakshi News home page

పొలిటికల్‌ డ్రామా షురూ

Published Tue, Sep 6 2022 4:01 AM

Director Krishna Chaitanya Launches Sharwanand Next Film - Sakshi

వెండితెరపై పొలిటికల్‌ టర్న్‌ తీసుకున్నారు శర్వానంద్‌. కృష్ణ చైతన్య దర్శకత్వంలో శర్వానంద్‌ హీరోగా నటిస్తున్న తాజా సినిమా ప్రారంభోత్సవం సోమవారం హైదరాబాద్‌లో జరిగింది. పొలిటికల్‌ యాక్షన్‌ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో రాశీ ఖన్నా హీరోయిన్‌గా నటిస్తుండగా, ప్రియమణి ఓ కీలక పాత్ర చేస్తున్నారు. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్న సినిమా ఇది.

ఈ సినిమా పూజా కార్యక్రమంలో దర్శకులు చందూ మొండేటి, హను రాఘవపూడి, సుధీర్‌ వర్మ, యూవీ క్రియేషన్స్‌ వంశీ, ప్రమోద్‌లు స్క్రిప్ట్‌ను దర్శకుడికి అందించారు. ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు త్రివిక్రమ్‌ క్లాప్‌ ఇవ్వగా, కృష్ణ చైతన్య దర్శకత్వం వహించారు. ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ అక్టోబరులో ప్రారంభం కానుంది. ఈ చిత్రానికి సంగీతం: యువన్‌ శంకర్‌ రాజా, సహనిర్మాత: వివేక్‌ కూచిభొట్ల.

Advertisement
 
Advertisement
 
Advertisement