అలా అయితే ఎఫ్‌3 విడుదల వాయిదా వేస్తాం : దిల్‌ రాజు | Sakshi
Sakshi News home page

అలా అయితే ఎఫ్‌3 విడుదల వాయిదా వేస్తాం : దిల్‌ రాజు

Published Sun, Jan 30 2022 8:50 AM

Dil Raju Talk About Rowdy Boys Movie - Sakshi

‘రౌడీబాయ్స్‌’ ఆశిష్‌ కెరీర్‌కు శుభారంభాన్నిచ్చింది. ఆశిష్‌ హీరోగా పరిచయం అయిన తొలి సినిమా రెండో వారం పూర్తయ్యేసరికి 12 కోట్ల గ్రాస్‌ కలెక్షన్స్‌ రాబట్టడం చాలా సంతోషంగా ఉంది. మూడోవారం పూర్తయ్యేసరికి 15 కోట్ల గ్రాస్‌ సాధిస్తుందనే నమ్మకం ఉంది. ఓ కొత్త హీరోకి ఈ స్థాయిలో కలెక్షన్స్‌ రావడం అంటే సాధారణ విషయం కాదు. ‘రౌడీబాయ్స్‌’ మా అంచనాలు అందుకుంది’’ అన్నారు ‘దిల్‌’ రాజు. 

ఆశిష్‌ హీరోగా పరిచయం అయిన ‘రౌడీబాయ్స్‌’ ఈ నెల 14న విడుదలైంది. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్‌లో జరిగిన విలేకర్ల సమావేశంలో ‘దిల్‌’ రాజు ఇంకా మాట్లాడుతూ – ‘‘వచ్చే నెల మూడో వారం నుంచి కరోనా తీవ్రత తగ్గి పెద్ద సినిమాల విడుదలకు మార్గం సుగమం అవుతుందనే ఆశిస్తున్నాం. ప్రస్తుత పరిస్థితుల కారణంగానే ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ రెండు విడుదల తేదీలను ప్రకటించింది. ఒకవేళ పరిస్థితుల కారణంగా మార్చి 18న కాకుండా ఏప్రిల్‌ 28న విడుదలకు ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సిద్ధమైతే ‘ఎఫ్‌ 3’ సినిమా వాయిదా పడవచ్చు. ఎందుకంటే పాన్‌ ఇండియన్‌ మూవీ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’కు ప్రిఫరెన్స్‌ ఇవ్వాలి. అలాగే ఏపీలోని సినిమా టికెట్‌ ధరల సవరణ గురించి ఫిబ్రవరిలోపు పరిష్కారం లభిస్తుందనే నమ్ముతున్నాను. ప్రభుత్వం నియమించిన కమిటీ సిఫార్సుల ఆధారంగా నిర్ణయాలు ఉంటాయి’’ అన్నారు. 

Advertisement
 
Advertisement