తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆ విధానం అమలవుతుంది: దిల్‌ రాజు | Dil Raju Comments On Tamil Film Active Producers Association, More Details Inside | Sakshi
Sakshi News home page

తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆ విధానం అమలవుతుంది: దిల్‌ రాజు

Nov 21 2024 8:37 AM | Updated on Nov 21 2024 10:37 AM

Dil Raju Comments Tamil Film Active Producers Association

సినిమా రివ్యూల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్న తమిళ్‌ ఫిల్మ్ యాక్టివ్‌ ప్రొడ్యూసర్స్‌ అసోసియేషన్‌పై టాలీవుడ్‌ నిర్మాత దిల్‌ రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. తమిళ ఇండస్ట్రీలో వారు తీసుకున్న నిర్ణయాన్ని తప్పకుండా అమలు చేస్తారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా దానిని అమలు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆయన అభిప్రాయా పడ్డారు.

సినిమా విడుదలైన తర్వాత థియేటర్ల వద్దకు కొన్ని యూట్యూబ్‌ ఛానల్స్‌, రివ్యూలు ఇచ్చేవారిని అనుమతించకూడదని తమిళ్‌ ఫిల్మ్ యాక్టివ్‌ ప్రొడ్యూసర్స్‌ అసోసియేషన్‌ నిర్ణయం తీసుకుంది. ఇలాంటి రివ్యూస్‌ వల్ల ఇండస్ట్రీ చాలా ఎక్కువగానే నష్టపోతుందని వారు తెలిపారు. దీనిని అరికట్టాలంటే థియేటర్‌ యజమానులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. థియేటర్‌ ముందు రివ్యూస్‌ చెప్పేవారిని లోపలికి అనుమతించకూడదని నిర్ణయించారు.

దిల్‌ రాజు నిర్మించిన కొత్త సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’ విడుదల తేదీని ప్రకటించే కార్యక్రమంలో ఇదే విషయం గురించి ఆయన మాట్లాడారు. 'కోలీవుడ్‌లో వారు తీసుకున్న నిర్ణయం విజయవంతమవుతుంది.  తెలుగు రాష్ట్రాల్లో కూడా అలా అమలయ్యే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. ఈ విషయంలో వ్యక్తిగతంగా నిర్ణయం తీసుకోలేము. ఫిల్మ్‌ ఛాంబర్‌ జోక్యం చేసుకుని ఫైనల్‌గా నిర్ణయం తీసుకోవాలి. ఇప్పటికే చాలామంది ఇక్కడి ఎగ్జిబిటర్లు అలాంటి రివ్యూలను అరికట్టాలని సిద్ధంగా ఉన్నారట' అని దిల్‌ రాజు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement