టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు ఆసక్తికర కామెంట్స్ చేశారు. గతంలో తనకు అమెరికా వీసా మూడు సార్లు తిరిస్కరణకు గురైందని తెలిపారు. కానీ ఆ తర్వాత 2009లో మరో చరిత్ర షూటింగ్ టైమ్‌లో నాకు వీసా లభించిందని అన్నారు. అప్పుడే తొలిసారి యూఎస్ వెళ్లానని వెల్లడించారు. వీసా రిజెక్ట్ అయినప్పుడు మీ ఫీలింగ్ ఏంటని యాంకర్ దిల్ రాజును ప్రశ్నించారు.
దీనికి దిల్ రాజు బదులిస్తూ.. తొక్కా.. వాళ్లేంటి ఇచ్చేది.. వీసా వచ్చినప్పుడే పోదాం లే అనుకున్నా అని అన్నారు. అప్పటికే నేను ఆర్య, బొమ్మరిల్లు చిత్రాలను నిర్మించానని దిల్ రాజు తెలిపారు. కాగా.. తరుణ్ భాస్కర్ ప్రధాన పాత్రలో వస్తోన్న చిత్రం గాయపడ్డ సింహం. ఈ మూవీకి కశ్యప్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు. మే 1న ఈ చిత్రం థియేటర్లలో రిలీజ్ కానుందని వెల్లడించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన ఈవెంట్‌కు నిర్మాత ముఖ్య అతిథిగా దిల్‌రాజు హాజరయ్యారు.
రిలీజ్ డేట్ మారొచ్చు..
అనంతరం ఈ మూవీ రిలీజ్ డేట్ గురించి దిల్ రాజు మాట్లాడారు. వీళ్లు మే 1వ తేదీకి రిలీజ్ చేస్తామని అంటున్నారు. కానీ ఏప్రిల్ 30న పెద్ది రిలీజ్ కానుంది. అలాంటి టైమ్‌లో వీళ్లు వన్ వీక్ వెనక్కి వెళ్లే అవకాశముందని అన్నారు. కాకగా. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయం వల్ల ఓ యువకుడి జీవితం ఎలా మారింది? అనే కోణంలో ఈ మూవీని తెరకెక్కించారు. ఈ మూవీలో తరుణ్ భాస్కర్‌కు జంటగా ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా నటిస్తున్నారు.
అప్పట్లో అమెరికా వెళ్దాం అనుకుంటే..
నాకు... 3 సార్లు వీసా రిజెక్ట్ అయ్యింది
'మరో చరిత్ర' షూటింగ్ టైంలో దొరికింది
తొక్క... వాళ్ళు ఇచ్చేది ఏంటి.. వచ్చినప్పుడే వెళదామని అనుకున్నాను
అప్పటికే నేను 'ఆర్య' 'బొమ్మరిల్లు' సినిమాలు తీసిన నిర్మాతని : దిల్ రాజు#TharunBhascker… pic.twitter.com/1lmiOuwQPu— Filmy Focus (@FilmyFocus) March 23, 2026


