యూట్యూబ్‌లో దుమ్మురేపుతున్న దిగు దిగు నాగ సాంగ్‌

Digu Digu Digu Naaga Song Crosses 20 Millions In Youtube  - Sakshi

ఈ మధ్యకాలంలో ఫోక్‌ సాంగ్స్‌కి మంచి ఆధరణ లభిస్తుంది. దీంతో భారీ బడ్జెట్‌ సినిమాల్లో కశ్చితంగా ఒక ఫోక్‌ సాంగ్‌ ఉండేలా ప్లాన్‌ చేస్తున్నారు మేకర్స్‌. ఈ క్రమంలో  ఇటీవలె విడుదలైన సారంగదరియా, బుల్లెట్‌ బండి వంటి పాటలు ఎంతలా హిట్‌ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తాజాగా ‘వరుడు కావలెను’సినిమా నుంచి రిలీజైన “దిగు దిగు నాగ” అనే ఫోక్‌ సాంగ్‌ యూట్యూబ్‌ను షేక్‌ చేస్తుంది. ఇప్పటివరకు ఈ పాటకు 20 మిలియన్‌కి పైగా వ్యూస్‌ వచ్చాయి.

అనంత్ శ్రీరామ్ రాసిన ఈ పాటను శ్రేయా గోషల్ ఆలపించింది. థమన్‌ సంగీతం అందించారు. నాగ శౌర్య, రీతూ వర్మ జంటగా నటించిన ఈ సినిమా నవంబర్‌ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. లక్ష్మీ సౌజన్య ఈ సినిమాతో దర్శకురాలిగా పరిచయం కానుంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై సూర్య దేవర నాగవంశీ నిర్మించిన ఈ చిత్రం​ ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటుంది. త్వరలోనే ప్రమోషన్స్‌ను మొదలుపెట్టేందుకు మేకర్స్‌ ప్లాన్‌ చేస్తున్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top