Dhanush And Aishwaryaa Rajinikanth Divorce Reason - Sakshi
Sakshi News home page

Dhanush : ధనుష్‌ ఇల్లు నిర్మిస్తున్న సమయంలో రజనీకాంత్‌ ఇచ్చిన సలహా ఏంటి..?

Aug 20 2023 1:08 PM | Updated on Aug 20 2023 1:31 PM

Dhanush And Aishwaryaa Rajinikanth Divorce Reason - Sakshi

కోలీవుడ్‌ స్టార్‌ హీరో ధనుష్‌-ఐశ్వర్యలు విడాకులు తీసుకుంటున్నట్లు సుమారు రెండేళ్ల క్రితం ప‍్రకటించడం ఆపై వారిద్దరూ వేరువేరుగా ఉంటున్న విషయం తెలిసిందే. సుమారు 18ఏళ్ల పాటు కలిసి ఉన్న ధనుష్‌ దంపతులు ఈ నిర్ణయం తీసుకోవడం ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారనేది బహిరంగంగా వారిద్దరిలో ఎవరూ తెలపలేదు. కానీ వారిద్దరి విడాకులకు కారణం ధనుష్‌ కట్టించుకున్న ఇళ్లే అని సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతుంది.

(ఇదీ చదవండి: బ్రోలో సాయిధరమ్‌ తేజ్‌ రెండో చెల్లెలిగా నటించిందెవరో తెలుసా?)

చెన్నైలోని పోయేస్‌ గార్డెన్‌లో హీరో ధనుష్‌ రూ.150 కోట్లతో కొత్త ఇంటిని నిర్మించిన సంగతి తెలిసిందే.. ఆ ఇంటిని నిర్మించే సమయంలో ధనుష్‌కు రజనీకాంత్‌ ఒక సలహా ఇచ్చారట. ఇళ్లు ఈ ప్రాంతంలో కాకుండా మరోచోట కట్టేందుకు ప్లాన్‌ చేయమని  రజనీకాంత్‌ సలహా ఇచ్చారట. దీనికి ప్రధాన కారణం వాస్తు, జ్యోతిష్యం పట్ల రజనీకి విశ్వాసం ఎక్కువ. దీంతో ఈ ఇళ్లు కడితే కుటుంబానికి కూడా అంతగా కలిసిరాదని వద్దన్నారట. కానీ ఇవేమి లెక్కచెయకుండా పోయేస్‌గార్డెన్‌లో రజనీ ఇంటికి అతి సమీపంలోనే ధనుష్‌ ఇళ్లు నిర్మించడం 2021లో ప్రారంభించాడు.

కానీ ఈ ఇంటి పనులను ప్రారంభించిన కొద్ది నెలల్లోనే ధనుష్‌-ఐశ్వర్య ఇద్దరి మధ్య గొడవలు రావడం స్టార్ట్‌ అయ్యాయట. తన నాన్నకంటే ఇంత రిచ్‌గా ఇళ్లు కట్టడం ఎందుకని వారిద్దరి మధ్య గొడవ మొదలైందట. వీటితో పాటు ఐశ్వర్య సినిమా డైరెక్టర్‌,నిర్మాత అవడం, అందువల్ల భారీగా డబ్బు నష్టపోవడం ధనుష్‌కు ఏ మాత్రం ఇష్టం లేదని అందుకే వారి మధ్య గొడవలు వచ్చాయిని కొందరు చెప్పుకొచ్చారు. ఇవన్నీ కాదు ధనుష్‌ మరో హీరోయిన్‌తో ఎఫైర్‌ పెట్టుకోవడం వల్లే విడాకుల వరకు వెళ్లారని మరికొందరి వాదనగా ఉంది. ఏదేమైన ఇక్కడ ఇళ్లు కట్టడం అంత మంచిది కాదని రజనీకాంత్‌ సూచించడం వాస్తవమేనని పలువురు చెప్పుకొచ్చారు.

అలా ధనుష్‌ నిర్మించిన ఇంటికి వాస్తు లేకపోవడంతోనే వారిద్దరి మధ్య దూరం పెరిగిందని ఇప్పుడు కోలీవుడ్‌లో ప్రచారం జరుగుతుంది. 2021లో ధనుష్‌ ఇంటి నిర్మాణం ప్రారంభిస్తే.. 2022లో వారిద్దరు విడిపోయారు. 2023లో ధనుష్‌ తన తల్లిదండ్రులతో ఆ కొత్త ఇంటిలోకి ప్రవేశించారు.

(ఇదీ చదవండి: తన 'కొత్త ప్రేమ'ని వెల్లడించిన సమంత)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement