Daggubati Abhiram: దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి మరో హీరో, అహింస రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

Daggubati Abhiram Ahimsa Release Date Fix - Sakshi

ప్రముఖ నిర్మాత సురేశ్‌బాబు తనయుడు, హీరో రానా సోదరుడు అభిరామ్‌ హీరోగా పరిచయమవుతున్న చిత్రం అహింస. తేజ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో గీతికా తివారీ హీరోయిన్‌. ఆనంది ఆర్ట్‌ క్రియేషన్స్‌ పతాకంపై పి.కిరణ్‌ నిర్మించారు. కాగా అహింస సినిమాను వేసవి కానుకగా ఏప్రిల్‌ 7న రిలీజ్‌ చేయనున్నట్లు చిత్రబృందం వెల్లడించింది.

యూత్‌ఫుల్‌ లవ్‌, యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా అహింస ఉంటుంది అని చిత్రయూనిట్‌ పేర్కొంది. రజత్‌ బేడీ, సదా, రవి కాలే, కమల్‌ కామరాజు, మనోజ్‌ టైగర్‌, కల్పలత, దేవీ ప్రసాద్‌ నటించిన ఈ చిత్రానికి సమీర్‌ రెడ్డి కెమెరామన్‌గా వ్యవహరిస్తుండగా ఆర్పీ పట్నాయక్‌ సంగీతం అందిస్తున్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top