తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్ ప్రస్తుతం తొమ్మిదో వారం నడుస్తోంది. గతవారంలో నయని పావని హౌస్ నుంచి ఎలిమినేట్ అయింది. వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. సోమవారం వచ్చిందంటే హౌస్‌లో మాటల యుద్ధమే. ఎందుకంటే నామినేషన్స్ ప్రక్రియ మొదలయ్యేది ఆ రోజు నుంచే. అయితే ఈసారి బిగ్‌బాస్ ఓ చిన్న కండీషన్ పెట్టాడు. ఎప్పుడూ ఇద్దర్ని నామినేట్ చేయాలని చెప్పే బిగ్‌బాస్ ఈసారి మాత్రం ఒక్కరిని మాత్రమే నామినేట్ చేయాలన్నాడు.
అలా ఈ వారం నామినేషన్స్ ప్రక్రియ మొదలైంది. పలు కారణాలతో ఈ వారం యష్మి, ప్రేరణ, గౌతమ్, నిఖిల్, హరితేజ, విష్ణుప్రియ, పృథ్వీ నామినేట్ అయ్యారు. అయితే ఒక్క రోజులోనే ఈ ప్రక్రియ పూర్తి కాలేదు. మంగళవారం కూడా నామినేషన్స్ కొనసాగాయి. తాజాగా ఇవాల్టి ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో విడుదల చేశారు.
ఈ రోజు నామినేషన్స్ ప్రక్రియలో హరితేజ, ప్రేరణ మధ్య మాటల యుద్ధం నడిచింది. ఇప్పటివరకు జరిగిందంతా చాలు.. ఇక నుంచి ఆపేద్దాం.. నోరు బాగుంటే ఊరు బాగుంటది' అంటూ ప్రేరణను అడిగింది హరితేజ. ఏదైనా స్ట్రాంగ్ పాయింట్ ఉంటే నామినేట్ చేసుకుందాం. అంతేకానీ మనిద్దరికీ ఫైట్ చేయాల్సిన అవసరం లేదు. ఈ మాటలకు హరితేజను అభినందిస్తూ మాట్లాడింది ప్రేరణ. ఆ తర్వాత మళ్లీ హరితేజను ఫేక్ అని ప్రేరణ అనడంతో మరింత మాటల యుద్ధం నడిచింది. ప్రతిసారి ఫేక్ అనొద్దు.. మాటలు ముందు సక్కగా మాట్లాడు అంటూ హరితేజ వాదించింది. దీంతో వీరిద్దర మధ్య జరిగిన వార్ పూర్తిగా తెలియాలంటే ఇవాల్టి ఎపిసోడ్ చూసేయండి.
Comments
Please login to add a commentAdd a comment