మరోసారి గుడ్‌ న్యూస్‌ చెప్పిన మెగాస్టార్‌ చిరంజీవి

Chiranjeevi good news for film industry workers and journalists - Sakshi

సినీ జర్నలిస్టులకు, సినీ కార్మికులకు మెగాస్టార్ చిరంజీవి  గుడ్ న్యూస్

ఉచితంగా కరోనా టీకా

సాక్షి, హైదరాబాద్‌:  రెండో దశలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో  మెగాస్టార్ చిరంజీవి  సినీ జర్నలిస్టులకు, సినీ కార్మికులకు గుడ్ న్యూస్ చెప్పారు. ‘కరోనా క్రైసిస్‌ ఛారిటీ’ (సీసీసీ) ద్వారా  ఉచితంగా  కోవిడ్‌-19 టీకా ఇప్పించనున్నామని  మంగళవారం ట్విటర్‌లో వెల్లడించారు.  తెలుగు చిత్ర పరిశ్రమలోని సినీ కార్మికులని,సినీ జర్నలిస్టులని కరోనా బారి నుంచి రక్షించుకునేందుకు అపోలో 24/7 సౌజన్యంతో  ఉచిత టీకా సౌకర్యాన్ని అందిస్తున్నామని  చిరంజీవి తెలిపారు. ప్రతి ఒక్కరూ భద్రంగా ఉండాలంటూ ఒక వీడియో సందేశాన్ని చిరంజీవి షేర్‌  చేశారు.

45 ఏళ్లు దాటిన వారిన సినీ కార్మికులు, వారి కుటుంబ సభ్యులకు ఉచితంగా వ్యాక్సిన్‌ అందిస్తామని చిరంజీవి తన సందేశంలో పేర్కొన్నారు. అలాగే వ్యాక్సిన్‌ తీసుకున్న వారికి మూడు నెలల పాలు అపోలో ఆసుపత్రి ద్వారా ఉచితంగా వైద్యులను సంప్రదించే అవకాశంతోపాటు, మందులను కూడా రాయితీ ధరలకు అందించే సదుపాయాన్ని కల్పిస్తున్నామని చిరంజీవి తెలిపారు. గతేడాది కరోనా వైరస్‌  సంక్షోభ కాలంలో కరోనా క్రైసిస్‌ ఛారిటీని ఏర్పాటు చేసిన  చిరు దాని ద్వారా ఎంతోమంది సినీ కార్మికులకు సాయం చేసిన సంగతి తెలిసిందే.  (రెమి‌డెసివిర్‌ అడిగిన దర్శకుడు: ఊహించని స్పందన)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top