Sushmita Sen Brother Rajeev Sen: రీసెంట్‌గా విడాకుల ప్రకటన.. ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్‌ అందించిన బాలీవుడ్‌ జంట

Charu Asopa And Rajeev Sen Announced Decide To Keep Their Marriage - Sakshi

నటి సుష్మితా సేన్‌ తమ్ముడు, మోడల్‌ రాజీవ్‌​ సేన్‌ తన భార్య, నటి చారు అసోపాతో విడిపోతున్నట్లు ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అంతేకాదు రాజీవ్‌తో విడాకులు తీసుకుంటున్న మాట నిజమేనంటూ  చారు అసోప సైతం స్పష్టం చేసింది. రాజీవ్‌కు విడాకుల నోటీసులు కూడా పంపానని ఆమె పేర్కొంది. దీంతో వీరిద్దరి విడాకులు ఖాయమని అంతా అనుకుంటున్నా క్రమంలో తాము ఒక్కటయ్యామంటు గుడ్‌న్యూస్‌ అందించింది ఈ జంట. తమ కూతురు జియానా కోసం కలిసి ఉండాలని నిర్ణయించుకున్నట్లు సోషల్‌ మీడియా వేదిక  ఈ జంట తెలిపింది. 

చదవండి: ఆస్ట్రేలియాలో ఘోర రోడ్డు ప్రమాదం, సింగర్‌ దుర్మరణం

వినాయక చవితి సందర్భంగా ఇంట్లో పూజ నిర్వహించిన ఈ జంట కూతురు జియానాతో ఉన్న ఫొటోను తమ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. ఈ సందర్భంగా తమ విడాకుల ప్రకటనను వెనక్కి తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు. ‘పెళ్లిళ్లు స్వర్గంలో జరుగుతాయంటారు. అయితే దానిని మేం అమలు చేయడమే మిగిలి ఉంది. అవును.. మా వివాహ బంధానికి మేం స్వస్తి చెప్పాలనుకున్నాం. మా నిర్ణయాన్ని కూడా ప్రకటించాం. ఇక మా మధ్య ఏం లేదు, మేం చివరి దశకు చేరుకున్నామని అనుకున్నాం. కానీ మా విడాకుల నిర్ణయాన్ని ఇప్పుడు వెనక్కి తీసుకుంటున్నాం. విడాకులు అనేవి మా ఎంపిక మాత్రమే అని గ్రహించాం’ అన్నారు. 

చదవండి: అందుకే సీక్రెట్‌గా పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది: కత్రినా కైఫ్‌

అలాగే ‘ఇకపై మా వైవాహిక జీవితాన్ని సంతోషంగా కొనసాగించాలనే నిర్ణయానికి వచ్చాం. ఈ విషయాన్ని మీతో పంచుకుంటున్నందుకు సంతోషంగా ఉంది. తల్లిదండ్రులుగా మా కూతురు జియానాకు ఉత్తమైన జీవితాన్ని ఇవ్వాలనుకుంటున్నాం. తన భవిష్యత్తు, సంతోషమే మా మొదటి ప్రాధాన్యత.. జంటగా మాకు ఎల్లప్పుడూ మద్దతు ఇస్తూ వస్తున్న అభిమానులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ప్రేమతో మా కూతురిని ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞులం’ అంటూ వారు తమ పోస్ట్‌లో రాసుకొచ్చారు. కాగా గతంలో కూడా ఈ జంట విడాకుల ప్రకటన ఇచ్చి మళ్లీ వెనక్కి తగ్గిన సంగతి తెలిసిందే. 2019 జూన్‌లో రాజీవ్‌-అసోపాల పెళ్లి జరగగా గతేడాది నవంబర్‌లో వీరికి జియానా జన్మించింది. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top