Chandrabose: వాల్తేరు వీరయ్య టైటిల్‌ సాంగ్‌ లిరిక్స్‌ వివాదం.. యండమూరికి చంద్రబోస్‌ గట్టి కౌంటర్‌

Chandra Bose Respond On Writer Yandamuri Veerendranath Comments - Sakshi

ప్రముఖ నవలా రచయిత, మోటివేషనల్ స్పీకర్ యండమూరి వీరేంద్రనాథ్‌కు సినీ గేయ రచయిత చంద్రబోస్‌ స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చారు.  ‘వాల్తేరు వీరయ్య’ చిత్రంలో చంద్రబోస్‌ రాసిన టైటిల్‌ సాంగ్‌పై ఫేస్‌బుక్‌ వేదికగా ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్‌ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఈ పాటలో సాహిత్యం అర్థం లేకుండా ఉందని, పాటలోని కొన్ని పంక్తులపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘తుఫాన్‌ అంచున తపస్సు చేసే వశిష్టుడే వీడే..తిమిరనేత్రమై ఆవరించిన త్రినేత్రుడే’ అనే పంక్తిని ఉద్దేశిస్తూ ‘తిమిరము’ అంటే అర్థం తెలుసా? శివదూషణ కాదా ఇది? ఎవరు రాశారో కానీ ఏమిటీ పిచ్చి రాతలు? అంటూ యండమూరి వీరేంద్రనాథ్‌ పోస్ట్‌ చేశారు.

చదవండి: నటి నయని పావని ఇంట తీవ్ర విషాదం, తండ్రి మృతి.. ఇన్‌స్టాలో ఎమోషనల్‌ పోస్ట్‌

ఆయన కామెంట్స్‌కి చంద్రబోస్‌ గట్టిగా బదులిచ్చారు. తాను రాసిన పాటలోని లైన్లు విరోధాబాసాలంకారం కిందకు వస్తాయని, పరస్పర విరుద్ధమైన రెండు పదాలు కలయికను లోతుగా పరికిస్తే విరోధం తొలగిపోయి ఆ పదబంధం లోతు తెలుస్తుందన్నారు. ఇది రచయితలు అందరికీ తెలుసని, తనకు తెలిసే ఈ ప్రయోగం చేశానని వివరణ ఇచ్చారు. అసలు తిమిరంలోని నిగూడార్థం తెలియని వారే అసలైన తిమిరమంటూ చంద్రబోస్‌ రీకౌంటర్ ఇచ్చారు. అంతేకాదు ప్రముఖ రచయిత సత్యానంద్‌ ఫోన్‌ చేసి సాహిత్యపరంగా అధ్యయనం చేయాల్సిన గీతమిదని ప్రశంసించారన్నారు.

చదవండి: సందీప్‌ రెడ్డి వంగ, రణ్‌బీర్‌ కపూర్‌ యానిమల్‌ నుంచి క్రేజీ అప్‌డేట్‌

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top