పెళ్లి బంధంలోకి అడుగుపెట్టిన ప్రముఖ క్యాస్టింగ్ డైరెక్టర్ | Casting director Shanoo Sharma shared wedding ceremony pics | Sakshi
Sakshi News home page

Shanoo Sharma: పెళ్లి బంధంలోకి క్యాస్టింగ్ డైరెక్టర్.. సోషల్ మీడియాలో పోస్ట్

Apr 26 2026 1:07 PM | Updated on Apr 26 2026 1:33 PM

Casting director Shanoo Sharma shared wedding ceremony pics

ఇప్పుడంతా పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లోనూ పెళ్లి భాజాలు మోగుతున్నాయి. తాజాగా ప్రముఖ బాలీవుడ్‌ క్యాస్టింగ్ డైరెక్టర్ షానూ శర్మ పెళ్లి చేసుకుంది. తన పెళ్లి వేడుకకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ శుభవార్త తెలుసుకున్న బాలీవుడ్ స్టార్స్ నూతన దంపతులకు విషెసె చెబుతున్నారు. రణవీర్ సింగ్, కృతి సనన్, పరిణీతి చోప్రా, ఖుషీ కపూర్, శర్వరి, వాణి కపూర్, వరుణ్ ధావన్, రష్మిక మందన్నతో సహా పలువురు సినీ ప్రముఖులు ఈ జంటకు అభినందనలు తెలిపారు. అయితే ఆమె తన భర్త వివరాలను వెల్లడించలేదు.

కాగా.. షానూ శర్మ పలువురు బాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలకు క్యాస్టింగ్‌ డైరెక్టర్‌గా పనిచేసింది. ఎన్టీఆర్, హృతిక్ రోషన్‌ కీలక పాత్రల్లో వచ్చిన వార్‌-2 మూవీకి సైతం వర్క్ చేసింది. బాలీవుడ్ ఇండస్ట్రీలో పలువురు నటుల కెరీర్‌ను తీర్చిదిద్దడంలో  షానూ ప్రధాన పాత్ర పోషించింది. ఆమె రణ్‌వీర్ సింగ్ బ్యాండ్ బాజా బారాత్‌, వాణి కపూర్‌ మూవీ దమ్ లగా కే హైషాలో, అర్జున్ కపూర్‌ ఇషాక్‌జాదే చిత్రాలకు నటీనటులను ఎంపికచేసింది.  అనుష్క శర్మ నటించిన రబ్ నే బనా ది జోడి మూవీకి క్యాస్టింగ్ డైరెక్టర్‌గా సేవలందించారు.  గతేడాది రిలీజైన  సైయారా మూవీకి అహాన్ పాండే, అనీత్ పడ్డాను  షానూ శర్మనే ఎంపిక చేసింది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్‌గా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement