అల్లు అర్జున్‌ అభిమానులపై కేసు 

Case Filed On Allu Arjun Fans For Birthday Celebrations On Midnight - Sakshi

సాక్షి, బంజారాహిల్స్‌: కరోనా నిబంధనలు ఉల్లంఘిస్తూ అనుమతులు తీసుకోకుండా అర్ధరాత్రి సమయంలో బాణసంచా కాల్చినందుకు సినీ హీరో అల్లు అర్జున్‌ ఫ్యాన్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ప్రశాంత్‌తో పాటు మరో అభిమాని సంతోష్‌పై జూబ్లీహిల్స్‌ పోలీసులు ఐపీసీ సెక్షన్‌ 290, 336, 188 కింద కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం... అల్లు అర్జున్‌ పుట్టిన రోజు సందర్భంగా బుధవారం అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో జూబ్లీహిల్స్‌ రోడ్‌ నం.68లోని ఆయన నివాసానికి  వందలాది మంది అభిమానులు తరలివచ్చారు.

ఎలాంటి అనుమతులు లేకుండానే గంటపాటు బాణసంచా కాల్చడంతో చుట్టుపక్కల వారికి తీవ్ర అసౌకర్యం కలిగింది. విపరీతమైన శబ్ధం వల్ల తాము నిద్రకు దూరమయ్యామని పలువురు డయల్‌ 100కు కాల్‌ చేసి చెప్పారు. దీంతో పెట్రోకార్‌ కానిస్టేబుల్‌ విశాల్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు అల్లు అర్జున్‌ ఫ్యాన్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ప్రశాంత్, మరో అభిమాని సంతోష్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 
అల్లుఅర్జున్‌ ఇంటి వద్ద గుమిగూడిన అభిమానులు

అల్లు అర్జున్‌ ఇంటి వద్ద అభిమానుల తాకిడి
బంజారాహిల్స్‌: సినీ నటుడు అల్లుఅర్జున్‌ పుట్టినరోజు సందర్భంగా గురువారం ఉదయం నుంచే వివిధ ప్రాంతాల నుంచి అభిమానులు జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెం.68లోని ఆయన నివాసానికి తరలి రావడంతో రహదారులన్నీ కిటకిటలాడాయి. దీంతో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు, ట్రాఫిక్‌ అంతరాయం కలుగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. చదవండి: ‘తగ్గేదే లే..’ అంటున్న బన్నీ.. ఫోటో వైరల్‌‌
కేబుల్‌ బ్రిడ్జి మీద బన్నీ‌ బర్త్‌డే వేడుకలు

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top