నటి మాల్వీవులు పోస్ట్‌: పునర్జీవనం 2020 | Can You Identify This Actress Who Vacationing In The Maldive | Sakshi
Sakshi News home page

నటి మాల్వీవులు పోస్ట్‌: పునర్జీవనం 2020

Oct 30 2020 2:18 PM | Updated on Oct 30 2020 3:40 PM

Can You Identify This Actress Who Vacationing In The Maldive  - Sakshi

లాక్‌డౌన్‌లో ఇంటికే పరిమితమైన బాలీవుడ్‌ నటి ఎల్లీ అవ్రమ్‌ తన డ్యాన్స్‌ వీడియోలను, సరదా ఫొటోలను తరచూ సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ ఉండేది. దాదాపు ఆరునెలల తర్వాత లాక్‌డౌన్‌ ఎత్తివేయడంతో కొంతమంది నటీనటులంతా తిరిగి షూటింగ్‌లో పాల్గొంటుండగా మరికొందరూ విహార యాత్రలకు వెళుతున్నారు. ఈ క్రమంలో ఎల్లీ అవ్రమ్‌ కూడా ఇటీవల మాల్దీవ్స్‌ టూర్‌కు వెళ్లిన విషయం తెలిసిందే. ఒంటరిగా విహార యాత్రకు వెళ్లిన ఆమె తన ఫొటోలను అభిమానులతో పంచుకుంటోంది. ఈ నేపథ్యంలో తన గదిలో ష్రగ్‌, సన్‌ క్యాప్‌ ధరించిన ఫొటోను శుక్రవారం షేర్‌ చేసింది. దానికి ‘మాల్దీవులలో పునర్జీవనం 2020’  అనే క్యాప్షన్‌ను జత చేసింది.

అంతేగాక స్విమ్మింగ్‌ పూల్‌లో ఈత కొడుతూ అల్పహారం తీసుకుంటున్న ఫోటోకు ‘బాగా తినండి.. బాగా ఈత కొట్టండి’ అంటూ షేర్‌ చేసింది. అవ్రమ్‌ పోస్టు చూసిన ఆమె అభిమానులు తమదైన శైలిలో స్పందిస్తూ కామెంట్స్‌ చేస్తున్నారు. అయితే టీమిండియా ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా మాజీ ప్రియురాలుగా ప్రచారంలో ఉన్న ఎల్లీ అవ్రమ్,‌ సౌరభ్‌ వర్మ దర్శకత్వంలో వచ్చిన ‘మిక్కి వైరస్’‌ చిత్రంతో బాలీవుడ్‌ ఆరంగేట్రం చేసింది. ఇందులో ఆమె నటుడు మనీష్‌ పాల్‌ సరసన నటించింది. ఆ తర్వాత ప్రముఖ హాస్యనటుడు కపిల్‌ శర్మతో కలిసి ‘కిస్‌ కిస్కో ప్యార్‌ కరూన్‌’లో కూడా నటించింది. ఇక తాప్సీ పన్ను ఇటీవల నటించిన ‘నామ్‌ షబానా’లో అవ్రమ్‌ అతిథి పాత్ర పోషించింది. అంతేగాక ప్రముఖ రియాలిటీ షో హీందీ బిగ్‌బాస్‌ 7 సిజన్‌ కూడా ‍కంటెస్టెంట్‌గా చేసింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement