బన్నీ ఫ్యాన్స్‌కి గుడ్‌ న్యూస్‌ చెప్పిన బన్నీవాసు | Bunny Vas Reveals Allu Arjun Birthday Special Gift Of Fans | Sakshi
Sakshi News home page

బన్నీ ఫ్యాన్స్‌కి గుడ్‌ న్యూస్‌ చెప్పిన బన్నీవాసు

Mar 31 2026 5:32 PM | Updated on Mar 31 2026 5:40 PM

Bunny Vas Reveals Allu Arjun Birthday Special Gift Of Fans

అల్లు అర్జున్‌ అభిమానులకు నిర్మాత బన్నీ వాసు గుడ్‌ న్యూస్‌ చెప్పాడు. బన్నీ బర్త్‌డే రోజు ఫ్యాన్స్‌కి అందించబోతున్న  ప్రత్యేక కానుక ఏంటో రివీల్‌ చేశారు. 

పుష్ప 2 లాంటి బ్లాక్‌ బస్టర్‌ తర్వాత అల్లు అర్జున్‌.. తమిళ దర్శకుడు అట్లీతో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన ఈ సినిమా చిత్రీకరణతో బిజీగా ఉన్నాడు . అయితే ఇప్పటి వరకు ఈ సినిమా టైటిల్‌ని అనౌన్స్‌ చేయలేదు. సోషల్‌ మీడియాలో రకరకాల పేర్లు వినిపిస్తున్నా..అధికారికంగా ప్రకటన మాత్రం రాలేదు. బన్నీ బర్త్‌డే (ఏప్రిల్‌ 8)  రోజు ఈ సినిమా టైటిల్‌ని ప్రకటించబోతున్నారట. ఈ విషయాన్ని నిర్మాత బన్నీ వాసు వెల్లడించారు.  

తాజాగా ఆయన పళ్లి చట్టంబి మూవీ టీమ్‌ ఏర్పాటు చేసిన గ్రాండ్‌ రిలీజ్‌ ప్రెస్‌ మీట్‌కి హాజరయ్యారు. ఈ సందర్భంగా బన్నీ బర్త్‌డే కానుకగా కొత్త సినిమా అప్‌డేట్‌ ఏమైనా ఉంటుందా అని ఓ విలేకరి అడిగిన ప్రశ్నలకు ఆయన పై విధంగా సమాధానం చెప్పాడు. టైటిల్‌ అనౌన్స్‌మెంట్‌తో పాటు స్పెషల్‌ పోస్టర్‌ని కూడా రిలీజ్‌ చేస్తారట.  

‘AA 22’ వర్కింగ్‌ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోయిన్‌గా దీపికా పదుకొణె నటిస్తోంది. దీపికతో పాటు జాన్వీకపూర్, మృణాల్‌ ఠాకూర్, రష్మికా మందన్నా, భాగ్యశ్రీ బోర్సే వంటి హీరోయిన్లు కూడా  నటించనున్నారనే ప్రచారం సాగుతోంది. అయితే ఈ విషయాలపై బన్ని బర్త్‌డే రోజు స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement