ఆంజనేయుని ఆనందబాష్పాలు

Brahmanandam draw swketch lord Rama and Hanumaan - Sakshi

బ్రహ్మానందం నటుడని అందరికీ తెలుసు. సాహితీప్రియుడు అని కొందరికి తెలుసు. ఆయన చిత్రలేఖనం చేస్తారని చాలా కొద్దిమందికి తెలుసు. కరోనా లాక్‌డౌన్‌ తర్వాత బ్రహ్మానందం చిత్రకళను సాధన చేస్తున్నారు. సుప్రసిద్ధ చిత్రకారుడు శేషబ్రహ్మంతో ఆయన తన చిత్రాలు పంచుకుంటూ ఆనందం పొందుతున్నారు. బ్రహ్మానందం ఎక్కువగా పెన్సిల్‌ డ్రాయింగ్స్‌ సాధన చేస్తున్నారు. ఆయన కొద్ది రోజుల క్రితం వేసిన మదర్‌ థెరిసా బొమ్మ ఆ కారుణ్యమూర్తి కరుణను రేఖల్లో పట్టుకోగలిగింది. ఇప్పుడు రామమందిర నిర్మాణ సందర్భం. ఈ సందర్భం రాముడి భక్తులందరికీ ఆనందదాయకం. ఇక అపర భక్తుడైన ఆంజనేయస్వామికి ఆనంద బాష్పాల సమయం కాకుండా ఉంటుందా. అందుకే బ్రహ్మానందం కాగితం, పెన్సిల్‌ అందుకున్నారు. ‘ఆంజనేయుని ఆనందబాష్పాలు’ పేరుతో ఈ చిత్రం గీశారు. రాముని కోవెలకు ఈ బొమ్మ ఒక భక్తిపూర్వక సమర్పణం అనుకోవచ్చు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top