దేవర భామ జాన్వీ కపూర్‌ బ్యాచిలరేట్‌ పార్టీ .. పెళ్లికి రెడీనా? | Bollywood Actress Janhvi Kapoor hosts bachelorette party Goes Viral | Sakshi
Sakshi News home page

Janhvi Kapoor: జాన్వీ కపూర్ బ్యాచిలరేట్‌ పార్టీ .. కానీ ఓ ట్విస్ట్!

Apr 15 2024 1:22 PM | Updated on Apr 15 2024 1:25 PM

Bollywood Actress Janhvi Kapoor hosts bachelorette party Goes Viral - Sakshi

బాలీవుడ్ భామ జాన్వీ కపూర్‌ ప్రస్తుతం దేవర చిత్రంలో జూనియర్ సరసన కనిపించనుంది. ఈ మూవీ ద్వారానే తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెడుతోంది. ఆ తర్వాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌ సరసన నటించనుంది. అయితే ఇటీవల జాన్వీ కపూర్‌ పెళ్లిపై నెట్టింట తెగ చర్చ నడుస్తోంది. ఎందుకంటే ఆమె మైదాన్‌ సినిమాకు చూసేందుకు వెళ్లిన జాన్వీ తన బాయ్‌ఫ్రెండ్‌ శిఖర్ పహారియా పేరుతో నెక్లెస్‌ ధరించి కనిపించారు. దీంతో త్వరలోనే పెళ్లి చేసుకోబోతోందంటూ వార్తలు హల్‌ చల్‌ చేస్తున్నాయి. అంతే కాకుండా శిఖర్‌పై జాన్వీ తండ్రి బోనీ కపూర్ సైతం ప్రశంసలు కురిపించారు. ఈ నేపథ్యంలో వీరిద్దరి పెళ్లి చేసుకోవడం ఖాయమని బీ టౌన్‌లో టాక్‌ నడుస్తోంది.

అయితే తాజాగా జాన్వీ కపూర్‌ బ్యాచిలరేట్‌ పార్టీని సెలబ్రేట్‌ చేసుకుంది. దీనికి సంబంధించిన ఫోటోలను తన  ఇన్‌స్టాలో షేర్ చేసింది. అదేంటీ అప్పుడే పెళ్లికి సిద్ధమైపోయిందనుకుంటున్నారా? కానీ ఇక్కడే ఓ చిన్న ట్విస్ట్‌ ఉంది. జాన్వీ కపూర్‌ తన ఫ్రెండ్‌ రాధికా మర్చంట్‌ బ్యాచిలరేట్‌ పార్టీని నిర్వహించింది. జాన్వీతో పాటు రాధిక ఫ్రెండ్స్‌ కూడా ఈ విందుకు హాజరయ్యారు. జాన్వీ కపూర్ హోస్ట్ చేసిన ఈ పార్టీలో ఆమె స్నేహితులందరూ గులాబీ రంగు దుస్తులు ధరించారు. ఈ పార్టీకి హాజరైన వారిలో అంజలి మర్చంట్ కూడా ఉన్నారు.

కాగా.. ఇటీవలే గుజరాత్‌లోని జామ్‌నగర్‌లోని  అనంత్ అంబానీ- రాధిక మర్చంట్‌ ప్రీ వెడ్డింగ్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పలువురు బాలీవుడ్ తారలు, వ్యాపారవేత్తలు, క్రీడాకారులు హాజరయ్యారు. పారిశ్రామికవేత్త వీరేన్ మర్చంట్ కుమార్తె రాధిక మర్చంట్ 2022 డిసెంబర్‌లో రాజస్థాన్‌లో జరిగిన వేడుకలో అనంత్ అంబానీతో నిశ్చితార్థం చేసుకున్నారు. వీరి వివాహం ఈ ఏడాది జూలైలో జరగనుంది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement