మోసాలకు పాల్పడుతున్న బాలీవుడ్ నటీనటుల అరెస్ట్

Bollywood Actors Natasha Kapoor and Apur Ashwin Arrested In Hyderabad - Sakshi

మోడలింగ్ పేరిట మోసాలకు పాల్పడుతున్న బాలీవుడ్ నటుడితో పాటు మరో నటిని సైబరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అపూర్ అశ్విన్, నటాషా కపూర్‌ను అరెస్ట్ చేశారు. చైల్డ్ మోడలింగ్ అవకాశాలు ఇప్పిస్తామని మోసాలకు పాల్పడినట్లు తెలుస్తోంది. కాస్మో పాలిటన్ మోడలింగ్ పేరుతో వెబ్‌సైట్ నిర్వహిస్తున్నట్లు తెలిసింది. ఓ వ్యాపార వేత్త నుంచి రూ.20 లక్షలు వసూలు చేసినట్లు తెలుస్తోంది. వ్యాపారవేత్తల పిల్లలే నిందితుల లక్ష‍్యంగా మోసాలకు పాల్పడినట్లు సమాచారం.

డబ్బులు వసూలు చేసిన బాలీవుడ్ నటీనటుల నుంచి ఎన్ని రోజులు గడుస్తున్నా ఎలాంటి సమాచారం లేకపోవడంతో బాధితులు సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న సైబరాబాద్ పోలీసులు వీరిద్దరినీ అరెస్ట్ చేసి దర్యాప్తు ప్రారంభించారు. 

మరిన్ని వార్తలు :

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top