కన్ను తాకితే కరోనా వచ్చింది! | Bollywood Actor Ranvir Shorey Blamed Himself For Being Careless About Hand Hygiene After He Got Infected By Covid-19 | Sakshi
Sakshi News home page

కన్ను తాకితే కరోనా వచ్చింది!

Feb 22 2021 10:48 PM | Updated on Feb 23 2021 1:05 AM

Bollywood Actor Ranvir Shorey Blamed Himself For Being Careless About Hand Hygiene After He Got Infected By Covid-19 - Sakshi

కొన్నాళ్ల క్రితం కరోనా ఏ సెలబ్రిటీకి వచ్చినా పెద్ద న్యూస్‌గా ఉండేది. ఇప్పుడు ఎవరికి వస్తున్నదో ఎవరికి పోతున్నదో పెద్దగా పట్టడం లేదు. తాజాగా బాలీవుడ్‌ నటుడు రణ్‌వీర్‌ షోరేకు కరోనా వచ్చింది. అతడు మాత్రం ఒక హెచ్చరిక చేశాడు. ‘చేతి శుభ్రత పాటించకపోవడం వల్లే నాకు కరోనా వచ్చిందని భావిస్తున్నాను. మేకప్‌ సమయంలో నేను నా కంటిని తాకాను. నేను శానిటైజ్‌ చేసుకోలేదు. కనుక దయచేసి అందరూ చేతి శుభ్రతను పాటించండి’ అని అతడు అప్పీలు చేశాడు. రణ్‌వీర్, కొంకణా సేన్‌లు 2010లో వివాహం చేసుకున్నారు. 2015 నుంచి విడిగా ఉంటూ 2020లో విడాకులు తీసుకున్నారు. వీరికి తొమ్మిదేళ్ల కొడుకు ఉన్నాడు. ‘మా అబ్బాయిని నాకు కరోనా రావడంతోటే కొంకణా ఇంటికి పంపించేశాను’ అన్నాడు రణ్‌వీర్‌. ప్రస్తుతం అతను ఒక గదిలో అతని 91 సంవత్సరాల తండ్రి ఒక గదిలో ఉంటున్నారట. రణ్‌వీర్‌ షోరే ‘భేజా ఫ్రై’, ‘దస్విదానియా’, ‘మోహ్‌ మాయా మనీ’ వంటి సినిమాలలో మంచి నటన ప్రదర్శించాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement