Bigg Boss Telugu 5: Shanmukh Jaswanth Video Goes Viral - Sakshi
Sakshi News home page

Shanmukh Jaswanth: మాట తప్పిన షణ్ను! వీడియో వైరల్‌!

Nov 13 2021 6:13 PM | Updated on Nov 17 2021 1:00 AM

Bigg Boss Telugu 5: Shanmukh Jaswanth Video Goes Wiral - Sakshi

నెక్స్ట్‌సారి ఇలా మాట్లాడితే మాత్రం.. వాళ్లు ఎలిమినేట్‌ అయినప్పుడు వీళ్లను కూడా పంపించేయండి సర్‌.. వీళ్లిద్దరూ ప్యాకేజీ, కలిసి వచ్చారు అని నాగ్ సర్‌కు చెప్తాను...

Bigg Boss 5 Telugu: బిగ్‌బాస్‌ హౌస్‌ కోపావేశాలతో అట్టుడుకిపోతోంది. కెప్టెన్సీ టాస్క్‌లో సిరి.. సన్నీ గేమ్‌ను ఆడటానికి ప్రయత్నించడం, దీంతో అతడు నోరు జారడం, ఇది సహించలేకపోయిన షణ్ను మధ్యలోకి దూరడంతో ఈ గొడవ చిలికి చిలికి గాలి వానలా మారింది. సిరి, సన్నీ గొడవ పడుతుంటే మధ్యలో షణ్ను ఎందుకు జోక్యం చేసుకున్నాడని కొందరు విమర్శిస్తుంటే, సిరి కోసం స్నేహితుడిగా షణ్ను స్టాండ్‌ తీసుకోవడంలో తప్పు లేదంటున్నారు మరికొందరు. అయితే ఇద్దరు వాదులాడుకుంటున్నప్పుడు మూడో వ్యక్తి కలగజేసుకోవడం తప్పని షణ్ను మాట్లాడిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.

'ఇంకోసారి సన్నీ వచ్చి తనకు కాజల్‌తో, మానస్‌తో, పింకీతో ఉన్న ఇష్యూల గురించి నాతో మాట్లాడితే.. వాళ్లు ఎలిమినేట్‌ అయినప్పుడు నువ్వు కూడా ఎలిమినేట్‌ అవ్వమని చెప్తాను. నెక్స్ట్‌సారి ఇలా మాట్లాడితే మాత్రం.. వాళ్లు ఎలిమినేట్‌ అయినప్పుడు వీళ్లను కూడా పంపించేయండి సర్‌.. వీళ్లిద్దరూ ప్యాకేజీ, కలిసి వచ్చారు అని నాగ్ సర్‌కు చెప్తాను. ఎంత ఇరిటేషన్‌ వస్తుందంటే.... హౌస్‌లో 19 మంది ఉన్నప్పుడు వేరు, 15 మంది ఉన్నప్పుడు వేరు, 10 మంది ఉన్నప్పుడు కూడా ఇంకా నీది నువ్వు మాట్లాడకుండా పక్కనవాళ్లది ఎందుకు మాట్లాడుతున్నారో అర్థం కాదు. నేనసలు ఎప్పుడైనా నీ(సిరి) గొడవలో ఇన్వాల్‌ అవుతానా? ' అని సిరితో సంభాషించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.

షణ్ను అడిగిన ప్రశ్నకు సిరి స్పందిస్తూ.. నువ్వు నా గొడవలో జోక్యం చేసుకోవని చెప్పింది. అలాగే షణ్నుకు ఇతర హౌస్‌మేట్స్‌తో గొడవైనప్పుడు తాను కూడా కలగజేసుకోలేదని బదులిచ్చింది. ఈ వీడియోపై నెటిజన్లు స్పందిస్తూ.. ఆయన రూల్స్‌ పెడతారు కానీ ఫాలో అవరని షణ్నూని విమర్శిస్తున్నారు. 'అంటే సరి-సన్నీ గొడవలో షణ్ను మధ్యలోకి వచ్చాడు కాబట్టి షణ్ను, సిరి ప్యాకేజీ అన్నమాట! సిరి ఎలిమినేట్‌ అయినప్పుడు షణ్నుని కూడా ఎలిమినేట్‌ చేయాలి' అని చెప్తున్నారు. వీళ్లిద్దరూ ప్యాకేజీ అని సరయూ మొదట్లోనే చెప్పింది, కానీ మనమే పట్టించుకోలేదని కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement