బిగ్ బాస్ జంట విడాకులు.. వీడియో రిలీజ్ చేసిన నటి! | Bigg Boss Malayalam Couple Firoz Khan And Sajna Announces Separation - Sakshi
Sakshi News home page

Bigg Boss: విడాకులు తీసుకున్న బిగ్ బాస్ జంట .. వీడియో రిలీజ్!

Published Tue, Dec 5 2023 5:57 PM | Last Updated on Fri, Dec 8 2023 4:15 PM

Bigg Boss Malayalam Couples Decided Two Separation - Sakshi

మలయాళ బిగ్ బాస్ మూడో సీజన్‌లో ఫేమ్ తెచ్చుకున్న జంట ఫిరోజ్ ఖాన్, సజ్నా ఫిరోజ్. ప్రస్తుతం ఈ జంట విడాకులు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. విడిపోవడానికి కేవలం తన వ్యక్తిగత కారణాలేనని సజ్నా సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఈ విషయాన్ని తన యూట్యూబ్ ఛానెల్‌ ద్వారా తెలిపింది. విడాకుల గురించి తెలిసి.. తన అభిమానులు తన పట్ల పూర్తి భిన్నంగా వ్యవహరిస్తున్నారని ఆమె ఆరోపించింది.

(ఇది చదవండి: యానిమల్ సక్సెస్.. క్రేజీ ట్యాగ్ కోల్పోయిన రష్మిక!)

సజ్నా వీడియోలో మాట్లాడుతూ..'ఈ విషయం చెప్పాలంటే నాకు చాలా బాధగా ఉంది. మాతో సన్నిహితులు కూడా ఇది ఊహించి ఉండరు. కానీ ఫిరోజ్, నేను విడాకులకు సిద్ధమవుతున్నాం. ఈ విషయాన్ని పరస్పరం అంగీకరించాం. అయితే ఇది పూర్తిగా మా వ్యక్తిగత నిర్ణయమే. ఈ విషయం తెలిసిన కొందరు నాతో అనుచితంగా ప్రవర్తించారు. నా తమ్ముడిగా భావించే వ్యక్తి నుంచే చేదు అనుభవం ఎదురైంది' అని తెలిపింది. అయితే విడిపోయినప్పటికీ మా పిల్లల కోసం మాట్లాడతామని పేర్కొంది. ప్రస్తుతం పిల్లలు మా అమ్మ వద్ద ఉన్నారని.. మేం విడిపోయామన్న విషయం వారికి తెలియదని చెప్పుకొచ్చింది. 

విడిపోయిన తర్వాత వచ్చిన మార్పులను సజ్నా వివరించింది. ప్రస్తుతం నా జీవితంలో ఒంటరిగా ప్రయాణిస్తున్నానని సజ్నా తెలిపింది. అయితే ఒకసారి నేను విడాకుల కోసం దాఖలు చేసిన తర్వాత దుబాయ్‌లో ఓ ఈవెంట్‌కి వెళ్లానని వెల్లడించింది. అక్కడ ఉన్న నా కుటుంబానికి చెందిన సోదరుడి లాంటి  వ్యక్తి నాతో చెడుగా ప్రవర్తించాడని చెప్పింది. వాడు నా వీపు మీద చెయ్యి వేసి అసభ్యంగా వ్యవహరించాడు. అతనికి చెడు ఉద్దేశాలు ఉంటే నేను అర్థం చేసుకోలేకపోయానని.. దీంతో ఏడుస్తూ కూర్చున్నానని ఆవేదన వ్యక్తం చేసింది. ఫిరోజ్, సజ్నాలకు ఇది రెండో వివాహం కాగా.. ఈ జంట  మలయాళంలో బిగ్ బాస్ కంటెస్టెంట్స్‌గా అడుగుపెట్టారు. ఈ  జంట షో మధ్యలోనే ఎలిమినేట్ అయ్యారు. ప్రస్తుతం సజ్నా టీవీ సీరియల్స్‌లో యాక్టివ్‌గా ఉంది.

(ఇది చదవండి: ఈ విషయం చెప్పేందుకు సిగ్గుతో తలదించుకుంటున్నా: విశాల్)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement