మా అందాలకు అదే వన్నె: బిగ్‌బాస్ అరియానా

సాక్షి, హైదరాబాద్: ఆత్మసంతృప్తే మగువల అందాలకు మరింత వన్నె తెస్తుందని అన్నారు బిగ్‌బాస్-4 ఫేమ్ అరియానా. బంజారాహిల్స్‌లోని రాడిసన్ బ్లూ ప్లాజా హోటల్‌లో రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న హైదరాబాద్ బ్యూటీ కాన్ఫరెన్స్–2021ను బిగ్‌బాస్ ఫేమ్ అరియనా, వర్ధమాన నటి లోహితా తనుడ్రాతో కలిసి సోమవారం ప్రారంభించారు. లాక్‌డౌన్ తర్వాత చాలారోజులకు ఫ్యాషన్ ప్రియులకు ఈ సదస్సు ఉపయోగపడుతుందని ఆమె తెలిపారు. ఈ బ్యూటీ కాన్ఫరెన్స్‌ను నిర్వహిస్తున్న ఎస్‌బీ ఇన్నోవేషన్స్ ఎండీ వంశీకృష్ణ మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన దాదాపు 50 ఫ్యాషన్ అనుబంధ ఉత్పత్తిదారులు ఈ ప్రదర్శనలో పాల్గొంటున్నారన్నారు. ప్రసిద్ధ బ్రాండ్స్ కాస్మొటిక్స్, స్కిన్ కేర్, పర్సనల్ ప్రొడక్ట్స్, బ్యూటీ ఫెస్ట్, సెలూన్ ఎక్విమెంట్స్ ప్రదర్శనకు ఉంటాయన్నారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి