ఊరు నుంచి ఊపుకుంటూ వచ్చావ్‌.. నీకంత సీన్‌ లేదు: నవదీప్‌ ఓవరాక్షన్‌ | Bigg Boss Agnipariksha Episode 4 Highlights, Navdeep Fires On Dammu Srija, Read Story For Episode Review | Sakshi
Sakshi News home page

Bigg Boss Agnipariksha: మాస్క్‌ మ్యాన్‌ అదుర్స్‌.. శ్రీముఖి, నవదీప్‌ ఓవరాక్షన్‌.. అంతలా అవమానించాలా?

Aug 25 2025 11:36 AM | Updated on Aug 25 2025 12:56 PM

Bigg Boss Agnipariksha, Episode 4: Navdeep Overaction on Dammu Srija

బిగ్‌బాస్‌ అగ్నిపరీక్షలో టాప్‌ 15కి ఆరుగురు సెలక్ట్‌ అయ్యారు. మిగిలిన తొమ్మిది స్థానాల కోసం 16 మంది పోటీపడుతున్నారు. వీరికి డేర్‌ ఆర్‌ డై అంటూ రకరకాల టాస్కులిచ్చారు. గెలిచినవారిని టాప్‌ 15కి పంపించారు. మరి ఎవరెవరు ఫైనల్స్‌లో అడుగుపెట్టారో నేటి (ఆగస్టు 25) ఎపిసోడ్‌లో చూసేద్దాం..

అరగుండుతో బిగ్‌బాస్‌లో
మొదటగా మాస్క్‌ మ్యాన్‌ హరీశ్‌, సాయికృష్ణను పిలిచి అరగుండు చేసుకోవాలని ఛాలెంజ్‌ విసిరారు. సీజన్‌ అంతా అరగుండుతోనే ఉండాలని మెలికపెట్టారు. మాస్క్‌ మ్యాన్‌ క్షణం ఆలోచించకుండా వెంటనే ట్రిమ్మర్‌ అందుకుని అరగుండు గీసుకున్నారు. దీంతో అతడిని విజేతగా ప్రకటించి టాప్‌ 15కి పంపించారు. నెక్స్ట్‌ దమ్ము శ్రీజ, ఊర్మిళను పిలిచి ఐయామ్‌ లూజర్‌ అని నుదుటిపై పచ్చబొట్టు వేసుకోవాలన్నారు. ఊర్మిళ మోడల్‌ కాబట్టి తాను రిజెక్ట్‌ చేసింది. శ్రీజ ధైర్యంగా ముందుకు వచ్చింది. అయితే ఐయామ్‌ లూజర్‌కు బదులుగా ఐ లవ్‌ బిగ్‌బాస్‌ అని పచ్చబొట్టు వేయించారు.

పది నిమిషాల్లో కిలో బరువు
తర్వాత సోల్జర్‌ పవన్‌ కల్యాణ్‌, అబూకు 10 నిమిషాల్లో కిలో బరువు పెరగాలని బిర్యానీ, బర్గర్‌ ముందు పెట్టారు. ఈ గేమ్‌లో పవన్‌ గెలిచాడు. ఒంటిచేత్తో బెలూన్‌ పగలగొట్టాలన్న గేమ్‌లో ప్రియ రెండు చేతులుపయోగించి దాలియాను ఓడించింది. కానీ, జడ్జిలు దాన్ని గమనించకపోవడంతో ప్రియను విజేతగా ప్రకటించి ఫైనల్స్‌కు పంపించారు. షాకీబ్‌, కల్కిలకు శ్రీముఖి ఓ ఛాలెంజ్‌ ఇచ్చింది. ముందుగా షాకీబ్‌ను బయటకు పంపేసి.. ఎవరికైనా ఒకరికి కాల్‌ చేసి అర్జంట్‌గా డబ్బులు వేయించుకోవాలి. (Bigg Boss Agnipariksha)

షాకీబ్‌కు అన్యాయం
ఎవరి అకౌంట్‌లో ఎక్కువ అమౌంట్‌ పడుతుందో వారు నెక్స్ట్‌ లెవల్‌కు వెళ్తారంది. దీంతో కల్కి తన ఫ్రెండ్‌కు రెండుసార్లు ఫోన్‌ చేయగా రూ.90 వేలు అకౌంట్‌లో పడ్డాయి. తర్వాత షాకీబ్‌ను స్టేజీపైకి పిలిచారు. కానీ మరీ అంత క్లారిటీగా టాస్క్‌ చెప్పలేదు. ఎవరికైనా కాల్‌ చేసి వీలైనంత డబ్బు నీ అకౌంట్‌లో వేయించుకో అంది శ్రీముఖి. కేవలం డబ్బు పడితే చాలేమో అనుకుని రూ.10 వేలు అడిగాడు. అతడి అమాయకత్వం చూసి మరో ఛాన్స్‌ ఇచ్చారు. అప్పుడు అతడి అకౌంట్‌లో రూ.50 వేలు పడ్డాయి.

దమ్మున్న శ్రీజ
ఎవరి దగ్గర ఎక్కువుంటే వారే విజేత అన్నది స్పష్టంగా షాకీబ్‌కు చెప్పుంటే బాగుండేది అని అందరికీ అనిపించింది. ఈ గేమ్‌లో కల్కి గెలిచింది. తనకు క్లియర్‌గా టాస్క్‌ వివరించి చెప్పలేదని షాకీబ్‌ ప్రశ్న లేవనెత్తాడు. దీంతో శ్రీముఖి.. ఎవరికైనా అన్‌ఫెయిర్‌ అనిపించిందా? అని అడగ్గా.. దమ్ము శ్రీజ చేయెత్తింది. తన తప్పు గమనించి ప్రశ్నిస్తారని ఊహించని శ్రీముఖి.. అయితే కూర్చో అంటూ శ్రీజను మాట్లాడనివ్వలేదు. 

నవదీప్‌, శ్రీముఖి ఓవరాక్షన్‌
కానీ నవదీప్‌ మాత్రం శ్రీజను స్టేజీపైకి పిలిచాడు. ఎందుకు అన్‌ఫెయిర్‌గా అనిపించిందని ప్రశ్నించాడు. అందుకు శ్రీజ.. ఎవరి దగ్గర ఎక్కువ డబ్బుంటే వారే గెలుస్తారని కల్కికి వివరంగా చెప్పారు, కానీ, అతడికి ఆ మాట చెప్పలేదని ధైర్యంగా అనేసింది. దాంతో నవదీప్‌ కోప్పడ్డాడు. నువ్వు అతిగా ఆలోచించొద్దు. బిగ్‌బాస్‌ అనేది చాలా భాషల్లో ఎన్నో సీజన్లు జరిగాయి. ఊరు నుంచి ఊపుకుంటూ వచ్చి అన్‌ఫెయిర్‌ అని చెప్పడానికి.. నీకంత సీన్‌ లేదు. ఇంకోసారి ఇలా చేయకు అంటూ ఆమెను చులకన చేసి మాట్లాడాడు. మొత్తానికి నాలుగు ఎపిసోడ్‌లో హరీశ్‌, శ్రీజ, ప్రియ, కల్కి.. టాప్‌ 15లో అడుగుపెట్టారు.

 

చదవండి: నారీమణులతో.. ఒకే ఒక్కడు.. ఫోటో వైరల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement