టికెట్‌ టు ఫినాలే.. ఆదిలోనే రైతుబిడ్డ అవుట్‌.. కానీ.. | Sakshi
Sakshi News home page

Bigg Boss Telugu 7: ఫినాలే అస్త్ర.. రేసులో నుంచి వాళ్లిద్దరూ అవుట్‌.. కానీ ఓ ట్విస్ట్‌

Published Tue, Nov 28 2023 1:27 PM

Bigg Boss 7 Telugu: Wheel Challenge In Ticket To Finale Task - Sakshi

డబుల్‌ ఎలిమినేషన్‌ సమయంలో గ్రూపులు బయటపడ్డాయి. హౌస్‌లో స్పా(శోభ, ప్రియాంక, అమర్‌), స్పై(శివాజీ, ప్రశాంత్‌, యావర్‌) బ్యాచ్‌లున్నాయని స్వయంగా నాగార్జునే బయటపెట్టాడు. దీంతో గ్రూప్‌ గేమ్‌ ఆడట్లేదంటూ అబద్ధాలు వల్లెవేస్తున్న శివాజీ నాటకాలకు అడ్డుకట్ట వేసినట్లయింది. ఇక నామినేషన్స్‌తో బిగ్‌బాస్‌ హౌస్‌లో లెక్కలు మారిపోయాయి. స్పై బ్యాచ్‌కు దగ్గర్లో ఉన్న అర్జున్‌ నామినేషన్స్‌తో శివాజీకి పూర్తిగా దూరమయ్యాడు.

ఈ విషయాలను పక్కనపెడితే బిగ్‌బాస్‌ ఫినాలేకు చేరుకోవడానికి టికెట్‌ టు ఫినాలేను ప్రవేశపెట్టాడు. ఫినాలే అస్త్ర గెలుచుకున్నవారు నేరుగా ఫైనల్స్‌కు వెళ్తారని చెప్పాడు. అయితే ఒకటీరెండు ఆటలు కాకుండా దాదాపు 10 వరకు టాస్క్‌లివ్వనున్నట్లు తెలుస్తోంది. టాస్క్‌లో గెలిచినవారికి వంద పాయింట్లు ఇస్తున్నట్లు కనిపిస్తోంది. అలా చివరికి ఎవరి దగ్గర ఎక్కువ పాయింట్లు ఉంటే వారే ఫినాలే అస్త్ర సొంతం చేసుకుంటారు.

తాజాగా రిలీజైన ప్రోమోలో.. ఫినాలే అస్త్ర కోసం మొదటి టాస్క్‌ ఇచ్చాడు. ఈ ఆటలో ప్రశాంత్‌ మొదట అవుట్‌ అవగా.. అర్జున్‌ చివరి వరకు ఉండి గెలిచాడు. రెండో గేమ్‌లో ప్రశాంత్‌, మూడో గేమ్‌లో అర్జున్‌ గెలిచారు. పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉన్న శివాజీ, శోభ గేమ్‌లో నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. వీరు తమ పాయింట్లను అమర్‌కు త్యాగం చేసినట్లు వినికిడి!

చదవండి: రంగులు గుమ్మరించినట్లుగా ఉన్న ఈ షర్ట్‌ ధరెంతో తెలుసా?

Advertisement
Advertisement