Bigg Boss 5 Telugu: అలా ఏడిస్తే హౌజ్‌ నుంచి ముందుగా వచ్చేది నువ్వే

Bigg Boss 5 Telugu: Kaushal Suggest To Jessy Said Be Strong - Sakshi

ఈ సారి బిగ్‌బాస్‌ హౌజ్‌లో తొలి రోజే గొడవలు మొదలయ్యాయి. సోమవారం జరిగిన ఎపిసోడ్‌లో కంటెస్టెంట్స్‌ మధ్య వివాదాలు తలెత్తాయి. ఒకరి నెగిటివిటి ఒకరూ బయటపెట్టడంతో రచ్చ రచ్చ జరిగింది. ఆదివారం బిగ్‌బాస్‌ 5 తెలుగు సీజన్‌ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నిన్నటి ఎపిసోడ్‌లో నామినేషన్స్‌ ప్రక్రియ జరిగింది.  ఈ నేపథ్యంలో నామినేట్‌ చేసే సభ్యులను ఎందుకు చేస్తున్నామో వివరించే క్రమంలో వారితో అయిన మిస్‌ కమ్యూనికేషన్‌ వల్ల హౌజ్‌మెట్స్‌ మధ్య గొడవలు తలెత్తాయి. అయితే ఎక్కువ మంది ఇంటి సభ్యులు జస్సీని  నామినేట్‌ చేశారు.

చదవండి: బిగ్‌బాస్‌ 5: నాగార్జున రెమ్యునరేషన్‌ మామూలుగా లేదుగా!

కాగా జస్సీ మోడలింగ్‌ బ్యాక్‌గ్రౌండ్‌తో హౌజ్‌లో అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. కాగా జస్సీ ఓ సందర్భంలో మాట్లాడిన తీరు తమకు నచ్చలేదంటూ కొంతమంది తమ అభిప్రాయాన్ని వెల్లడించారు. నామినేషన్‌ సమయంలో విశ్వకు, జస్సీకి మధ్య జరిగిన చిన్నపాటి డిస్కషన్‌లో జస్సీ బాధపడ్డాడు. ఆ తర్వాత నటరాజ్‌ మాస్టర్‌ కూడా జస్సీని నామినేట్‌ చేస్తూ ‘చిన్నోడా నిన్ను చూస్తే అయాకుడిలా ఉన్నావు, ఈ హౌజ్‌లో నువ్వు ఉండలేవు అనిపిస్తుంది. అందుకే నామినేట్‌ చేస్తున్న’ అంటూ లిన చెప్పడంతో వెంటనే జస్సీ కన్నీరు పెట్టుకున్నాడు.

చదవండి: Bigg Boss 5 Telugu: వీడియోతో దొరికిపోయిన లోబో..నెటిజన్ల ట్రోల్స్‌

దీంతో అందరూ అతడి ఓదార్చడం జరిగింది. దీనిపై బిగ్‌బాస్‌ సీజన్‌ 2 విజేత కౌశల్‌ సోషల్‌ మీడియా వేదికగా స్పందించాడు. తోటి మోడల్‌గా జస్సీకి మద్దతుగా నిలిచాడు. అతడిని ఉద్దేశిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీ షేర్‌ చేస్తూ.. ‘నా తర్వాత, సీజన్‌ 3లో అలీ రేజా తర్వాత మోడలింగ్‌ బ్యాక్‌గ్రౌండ్‌ నుంచి వచ్చింది నువ్వే. మోడల్స్‌ కన్నీళ్లు పెట్టకూడదు. తమ యాటిట్యూడ్‌లో ప్రేమని గెలుచుకోవాలి.  అలా ఏడిస్తే మొదటగా హౌజ్‌ నుంచి ముందుగా నువ్వే బయటకు వస్తావు. జాగ్రత్తగా ఆడు. ఆల్‌ ది బెస్ట్‌’ అని సూచించాడు. కాగా ఈ నామినేషన్ ప్ర‌క్రియ‌లో కాజల్‌, హమీదా, జెస్సీ, రవి, మానస్‌, సరయూలు ఈ వీకెండ్‌ హౌజ్‌ నుంచి బయటకు వెళ్లే సభ్యులుగా డేంజ‌ర్ జోన్‌లో ఉన్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top