పంచె ఊడదీసి వికృతంగా ప్రవర్తించిన నటి | Sakshi
Sakshi News home page

బిగ్‌బాస్‌: రాఖీ సావంత్‌ విపరీత చేష్టలు

Published Thu, Dec 31 2020 2:22 PM

Bigg Boss 14 Hindi: Rakhi Sawant Removes Rahul Mahajan Dhoti - Sakshi

బిగ్‌బాస్‌లో గొడవలు సర్వసాధారణం. కానీ అవి శృతి మించితేనే అసలు సమస్య. ప్రస్తుతం హిందీ బిగ్‌బాస్‌ 14వ సీజన్‌ పరిస్థితి కూడా అలానే ఉంది. మాజీ కంటెస్టెంట్లను లోనికి పంపించగా వారు చేసే పనులతో ఇంటిసభ్యులు తలలు పట్టుకుంటున్నారు. ఈ క్రమంలో నటి, మాజీ కంటెస్టెంట్‌ రాఖీ సావంత్‌ వికృత చేష్టలకు కంటెస్టెంట్లు హడలెత్తిపోతున్నారు. ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తుందోనని భయంతో ఆమె దరిదాపుల్లోకి వెళ్లడానికి కూడా ధైర్యం చేయట్లేదు. ప్రస్తుతం హౌస్‌లో జరుగుతున్న కెప్టెన్సీ టాస్కులో రాక్షసి అవతారం ఎత్తిన రాఖీ.. అంతకు ముందు రోజు తనతో గొడవకు దిగిన  జాస్మిన్‌ భాసిన్‌ను కెప్టెన్‌ కానివ్వనంటూ శపథం చేసింది. అటు కంటెస్టెంట్లను ఇబ్బందులకు గురి చేస్తూ ముప్పు తిప్పలు పెట్టింది.(చదవండి: రాహుల్ లేక‌పోతే బిగ్‌బాస్ చూడం!)

మాజీ కంటెస్టెంట్‌ రాహుల్‌ మహాజన్‌ పంచె పట్టుకుని లాగారు. దాన్ని కర్చీఫ్‌లా ముక్కలు ముక్కలు చేస్తానని హెచ్చరించడమే కాకుండా నిజంగానే పంచె ఊడదీసి పేలికలుగా మార్చారు. దీంతో ఆమె విపరీత ప్రవర్తనపై హౌస్‌మేట్స్‌ గరమయ్యారు. ఇదే ఒక అమ్మాయికి జరిగితే ఇలాగే ఊరుకుంటారా? అని ప్రశ్నిస్తూ అలీ గోనీ టాస్కులో పాల్గొనేందుకు నిరాకరించాడు. అటు సోషల్‌ మీడియాలో సైతం రాఖీపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఒక యువకుడిని దాదాపు నగ్నంగా నిలబెట్టినంత పని చేసిందని రాఖీపై ఫైర్‌ అవుతున్నారు. టాస్క్‌ను టాస్క్‌లా ఆడాలి కానీ అంత అతి పనికి రాదని ఘాటుగా కామెంట్లు చేస్తున్నారు. మరి రాఖీ ప్రవర్తనపై సల్మాన్‌ ఖాన్‌ ఎలా స్పందిస్తారో చూడాలి! (చదవండి: బిగ్‌బాస్‌: కంటెస్టెంట్‌ను దూషించిన తల్లి)

 
Advertisement
 
Advertisement