Bheemla Nayak: ‘అడవి తల్లి’ పాట పాడిన దుర్గవ్వ ఎవరు? ఆమె నేపథ్యం ఏంటి?

Bheemla Nayak Song Adavi Thalli Mata Folk Song Singer Special Story In Telugu - Sakshi

Adavi Thalli Mata Singer: పవర్‌ స్టార్‌ పవన్‌ కల‍్యాణ్‌, రానా దగ్గుబాటి మల్టీసారర్‌గా వస్తున్న చిత్రం 'భీమ్లా నాయక్‌'. ఈ  సినిమాకు సాగర్‌ కె చంద్ర దర్శకత్వ వహించగా తమన్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే – మాటలు అందిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా చిత్రాన్ని జనవరి 12న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రిలీజ్‌ డేట్‌ దగ్గరపడుతుండడంతో మేకర్స్‌ ప్రమోషన్స్‌ స్టార్ట్‌ చేశారు. అందులో భాగంగా ఇప్పటికే మూడు పాటలను విడుదల చేశారు. 

తాజాగా ఈ సినిమా నుంచి నాలుగో సాంగ్‌ విడుదలైంది. ‘అడవి తల్లి’అనే  ఈ పాట విడుదలైన కొన్ని గంటల్లోనే యూట్యూబ్‌లో రికార్ట్‌ స్థాయి వ్యూస్‌తో దూసుకెళ్తుంది. ‘కిందున్న మడుసులకా పోపాలు తెమలవు.. పైనున్న సామేమో కిమ్మని పలకడు... దూ​కేటి కత్తులా కనికరమెరగవు.. అంటుకున్న అగ్గిలోన ఆనవాళ్లు మిగలవు..’అంటూ సాగా ఈ ‘అడవి తల్లి మాట’పాటకు రామజోగయ్యశాస్త్రీ లిరిక్స్‌ అందించగా, కుమ్మరి దుర్గవ్వ, సాహితి చాగంటి అద్భుతంగా ఆలపించారు.

ఈ పాటకు మంచి రెస్పాన్స్‌ వస్తుండడంతో ఈ పాట పాడిన సింగర్‌ గురించి వెతకడం ప్రారంభించారు నెటిజన్స్‌. కుమ్మరి దుర్గవ్వ ఎవరు? ఆమె నేపథ్యం ఏంటి? అని నెటిజన్స్‌ ఆరా తీస్తున్నారు. దుర్గవ్వ మంచిర్యాల జిల్లాకు చెందినది. ఆమె చదువుకోలేదు. పొలం పనులకు వెళ్లినప్పుడు జానపదాలను పాడుతూ ఉంటుంది.  తెలుగుతో పాటు మరాఠీలోనూ ఎన్నో పాటలు పాడారు. ఆమె పాడిన జానపదాల్లో.. 'ఉంగురమే రంగైనా రాములాల టుంగురమే', 'సిరిసిల్లా చిన్నది' వంటి పాటలు బాగా పాపులర్‌ అయ్యాయి. దీంతో ఆమెకు 'భీమ్లా నాయక్‌'లో ‘అడవి తల్లి’పాట పాడే అవకాశం వచ్చింది. ఈ పాటతో దుర్గవ్వ మరింత హైలైట్‌ అయింది. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top