నాకు మాటలు రావట్లేదు: భారతీరాజా

Bharathiraja Emotional Words about SP Balasubramaniam Health - Sakshi

సాక్షి, చెన్నై: కరోనా బారిన పడి ఆస్పత్రిలో చేరిన ప్రముఖ నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మళ్లీ తీవ్ర అనారోగ్యం పాలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సినీ ఇండస్ట్రీలోని ప్రముఖులతో పాటు అభిమానులు కూడా ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. ఈ నేపథ్యంలో తమిళదర్శకుడు భారతీరాజా ఎస్పీ బాలు ఆరోగ్య పరిస్థితిపై మాట్లాడుతూ.. కరోనాతో పోరాడి బాలు తిరిగి వస్తారని ఆశించా. కరోనాతో కోలుకుంటున్నారని అనుకున్నా.. ఆ పరిస్థితి లేదు. నా చిరకాల మిత్రుడిని ఈ పరిస్థితిలో చూసి బాధేసింది. బాధను ఎలా వ్యక్తం చేయాలో అర్థం కావడం లేదు అంటూ భారతీరాజా ఎస్పీ బాలు ఆరోగ్య పరిస్థితిపై ఆవేదన వ్యక్తం చేశారు. అయితే దురదృష్టవశాత్తు బాలసుబ్రహ్మణ్యం ఈ రోజు మధ్యాహ్నం కన్నుమూశారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top