వరుస సినిమాలతో దూసుకెళ్తున్న యంగ్‌ హీరో! | Bellamkonda Srinivas Upcoming Movies Details | Sakshi
Sakshi News home page

వరుస సినిమాలతో దూసుకెళ్తున్న యంగ్‌ హీరో!

Apr 9 2024 2:09 PM | Updated on Apr 9 2024 3:41 PM

Bellamkonda Srinivas Upcoming Movies Details - Sakshi

తొలి సినిమా ‘అల్లుడు శీను’తోనే హిట్‌ కొట్టి టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌. ఆ తర్వాత జయ జానకి నాయక, రాక్షసుడు వంటి హిట్‌ చిత్రాలతో స్టార్‌ హీరోల లిస్ట్‌లో చేరిపోయాడు. అయితే ఈ యంగ్‌ హీరో ఇటీవల నటించిన చిత్రాలేవి బాక్సాఫీస్‌ వద్ద విజయం సాధించలేకపోయాయి. దీంతో కాస్త గ్యాప్‌ తీసుకున్న ఈ సిక్స్‌ ప్యాక్‌ హీరో..ఇప్పుడు వరుస సినిమాలను లైన్‌లో పెట్టేశాడు.

ప్రస్తుతం 14 రీల్స్‌ ప్రొడక్షన్‌ హౌస్‌ బ్యానర్‌పై టైసన్‌ నాయుడు అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకి సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలో పూర్తి కానుంది. దీంతోపాటు షైన్ స్క్రీన్స్ ప్రొడక్షన్స్‌తో మరియు‌ మూన్‌షైన్ పిక్చర్స్‌తో చేతులు కలిపాడు.వీటి కోసం..మునుపెన్నడూ చూడని లుక్‌లో శ్రీనివాస్‌ కనిపించనున్నాడు అని తెలుస్తుంది.

ఇవీ అన్నీ కూడా చాలా ప్రత్యకమైన కథలు అని, ఇవి అతని కెరీర్‌లో కొత్త అధ్యాయాన్ని క్రియేట్‌ చేస్తాయి అని అంటున్నారు. యాక్షన్-ఓరియెంటెడ్ మరియు కంటెంట్-డ్రైవెన్ సినిమాలతో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నాడు.  శ్రీనివాస్‌ రీ ఎంట్రీ కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్‌ ఈ సినిమాలు ఆయనకు మంచి కమ్‌ బ్యాక్‌ మూవీలు అవుతున్నాయి అని ప్రేక్షకులు ఆశిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement