Bangarraju: ఓటీటీలో రికార్డులు సృష్టిస్తోన్న బంగార్రాజు

Bangarraju Sets New Records In Zee5 - Sakshi

Nagarjuna-Naga Chaitanya: కింగ్ అక్కినేని నాగార్జున, యువ సామ్రాట్ నాగచైతన్య, రమ్యకృష్ణ, కృతి శెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం `బంగార్రాజు`. 'సోగ్గాడు మళ్ళీ వచ్చాడు' అనేది ఉపశీర్షిక. క‌ళ్యాణ్ కృష్ణ కురసాల డైరెక్టర్‌. అన్నపూర్ణ స్టూడియోస్, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి నాగార్జున నిర్మాతగా వ్యవహరించాడు. సంక్రాంతికి థియేటర్లలో విడుదలై సూపర్‌ హిట్టయిన ఈ మూవీ ఫిబ్రవరి 18 నుంచి ''జీ 5' లో స్ట్రీమింగ్‌ అవుతున్న విషయం అందరికీ తెలిసిందే. జీ5 లో ప్రసారమవుతున్న ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటూ విడుదలైన 7 రోజుల్లోనే 500 మిలియన్ స్ట్రీమింగ్ నిమిషాలతో సక్సెస్ ఫుల్‌గా దూసుకుతోంది.

ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ.. 'కోవిడ్ టైంలో ఈ సినిమా రిలీజ్ చేస్తే ఇబ్బంది పడతారని నా శ్రేయోభిలాషులు సలహా ఇచ్చారు. అయితే మా "సోగ్గాడే చిన్నినాయన" సినిమాను గతంలో కూడా సంక్రాంతికి రిలీజ్ చేశాం. ఆ సెంటిమెంట్‌తో కోవిడ్ ఉన్నా కూడా మేము ఎంతో ధైర్యం చేసి సంక్రాంతికి మా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చాం. మేము ఊహించిన దానికన్నా ఎక్కువ రెస్పాన్స్‌తో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఆ తర్వాత జీ5లో రిలీజ్‌ చేయగా.. అక్కడ స్ట్రీమింగ్ మొదలైన కేవలం 7 రోజుల్లోనే 500 మిలియన్ మినిట్స్ స్ట్రీమింగ్ అవ్వడం ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లోనే సరికొత్త రికార్డ్. ఈ సందర్భంగా బంగార్రాజును ఆదరించిన, ఆదరిస్తున్న, ఆదరించబోతున్న ప్రేక్షకులందరికీ మా టీం తరుపున కృతజ్ఞతలు తెలుపుతున్నాం' అన్నాడు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top