అడ్డంగా దొరికిన బండ్ల గణేష్‌: నెట్టింట్లో నవ్వులపాలు | Bandla Ganesh Trolled By Netizens Over Corona Mask Challan | Sakshi
Sakshi News home page

అడ్డంగా దొరికిన బండ్ల గణేష్‌: 'ఏ స్కూల్‌ బాబూ?'

Mar 29 2021 6:55 PM | Updated on Mar 29 2021 10:21 PM

Bandla Ganesh Trolled By Netizens Over Corona Mask Challan - Sakshi

టాలీవుడ్‌లో బండ్ల గణేష్‌ ప్రస్థానం ఓ పట్టాన అర్థం కాదు. కమెడియన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఆయన ఉన్నట్లుండి నిర్మాతగా మారి, ఆ వెంటనే స్టార్‌ హీరోలతో సినిమాలు తీసి, సూపర్‌ హిట్లు అందుకుని ఎంతో మందిని ఆశ్చర్యపరిచాడు. ఆ తర్వాత రాజకీయాల్లోకి అడుగు పెట్టిన అతడు తక్కువ కాలంలోనే యూటర్న్‌ తీసుకుంటూ పాలిటిక్స్‌కు గుడ్‌బై చెప్పాడు. తిరిగి సినిమాల బాట పట్టాడు, కానీ ప్రస్తుతానికి ఖాళీగా ఉన్నాడు. 

తాజాగా ఆయన సోషల్‌ మీడియాలో చేసిన పోస్టు నెట్టింట్లో నవ్వులపాలైంది. ఒకసారి కాదు, రెండుసార్లు తప్పులో కాలేయడంతో అతడిని ఓ రేంజ్‌లో ఆడుకుంటున్నారు నెటిజన్లు. కరోనా కోరలు చాస్తున్న నేపథ్యంలో అందరూ మాస్కులు ధరించాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశించిన విషయం తెలిసిందే. ముఖాన మాస్కు లేకపోతే ఫైన్‌లు వేస్తూ కఠినంగా వ్యవహరిస్తోంది. ఈ క్రమంలో మాస్కు ధరించకపోతే రూ.2 వేల రూపాయల ఫైన్‌ వేస్తున్న ఫొటోను ఆయన ట్విటర్‌లో షేర్‌ చేశాడు. ఈ సందర్భంగా అందరూ మాస్క్‌ ధరించాలని సూచించాడు.

ఆయన ఉద్దేశ్యం బాగానే ఉన్నా వాక్యంలో స్పెల్లింగ్‌ మిస్టేక్‌ ఉంది. Wear Mask అని రాయాల్సింది పోయి Where Mask అని ట్వీట్‌ చేశాడు. దీన్ని చాలామంది వేలెత్తి చూపించడంతో వెంటనే దాన్ని డిలీట్‌ చేశాడు. ఈసారి Ware Mask అంటూ మరోసారి తప్పు ట్వీట్‌ చేసి మళ్లీ అడ్డంగా దొరికిపోయాడు. మనది ఏ స్కూల్‌ అన్నా.. అంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. 'ఈయన దెబ్బకు మాకు వచ్చిన స్పెల్లింగ్‌ కూడా మర్చిపోయేలాగా ఉన్నామే', 'అది ware, where, ware కాదు, wear' అంటూ కామెంట్లు చేస్తున్నారు.

చదవండి: రోడ్డు మీద మహిళ ఇబ్బందులు: సన్నీలియోన్‌ భర్త సాయం

ముక్కు అవినాష్‌ తల్లికి అనారోగ్యం: CMRF‌ నుంచి చెక్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement