Adipurush Teaser: ఆదిపురుష్‌ మూవీ టీంకు భారీ షాక్‌! ఓంరౌత్‌పై అయోధ్య ప్రధాన పూజారి ఆగ్రహం

Ayodhya Ram Temple Head Priest Demands Immediate Ban on Adipurush - Sakshi

ప్రభాస్‌ లేటెస్ట్‌ పాన్‌ ఇండియా చిత్రం ఆదిపురుష్‌ టీజర్‌పై తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వస్తున్న సంగతి తెలిసిందే. టీజర్‌ విడుదలైనప్పటి నుంచి దీనిపై సాధారణ ప్రజలు, ఫ్యాన్స్‌తో పాటు రాజకీయ ప్రముఖులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇందులో రామాయణాన్ని తప్పుగా చూపించారంటూ డైరెక్టర్‌ ఓం రౌత్‌పై మండిపడుతున్నారు. రామాయణంలో రావణుడు, హనుమంతుడి పాత్రలు దర్శకుడిగా తెలియదా.. అధ్యయనం చేయకుండానే ఆదిపురుష్‌ను తెరకెక్కించాడంటూ బీజేపీ అసహనం వ్యక్తం చేస్తోంది. మరోవైపు వీఎఫ్‌ఎక్స్‌ అసలు బాగోలేదని, ఇది బొమ్మల సినిమాగా ఉందంటూ ఫ్యాన్స్‌ నిరాశ వ్యక్తం చేస్తున్నారు.

చదవండి: ‘మై విలేజ్‌ షో’ గంగవ్వ నెల సంపాదన ఎంతో తెలుసా?

టీజర్‌పై వస్తున్న వ్యతీరేకత చూసి ఇప్పటికే మూవీ టీం, డైరెక్టర్‌ అయోమయ స్థితిలో పడ్డారు. ఈ తరుణంగా ఆదిపురుష్‌ టీం మరో షాకిచ్చింది అయోధ్య. ఈ సినిమాను వెంటనే బ్యాన్‌ చేయాలని అయోధ్య రామమందిరం ప్రధాన పూజారి సత్యేంద్ర దాస్‌ డిమాండ్‌ చేశారు. వార్షిక రథయాత్ర సందర్భంగా ఇక్కడకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆదిపురుష్‌ టీజర్‌పై స్పందించారు. రామాయణంలో పేర్కొన్న విధంగా ఆదిపురుష్‌లో రాముడు, రావణుడు, హనుమంతుడి పాత్రలను డైరెక్టర్‌ ఓంరౌత్‌ చూపించలేదంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ‘ఈ సినిమాలోని రాముడు, రావణుడు, హనుమంతుడి పాత్రలు హిందుమత విశ్వాసాలను దెబ్బతీసేలా ఉన్నాయి.

చదవండి: ‘పొన్నియన్‌ సెల్వన్‌’ వివాదం, కమల్‌ హాసన్‌ సంచలన వ్యాఖ్యలు

 ఆ పాత్రలను డైరెక్టర్‌ రామాయణంలో ఉన్న విధంగా చూపించలేదు. ఇది వారిని అగౌరవ పరిచేలా ఉంది. తక్షణమే ఆదిపురుష్‌ను నిషేధించాలని మేం డిమాండ్‌ చేస్తున్నాం’ అని అయన పేర్కొన్నారు. అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ ఎంపీ బ్రిజ్‌ భూషన్‌ సైతం ఆదిపురుష్‌ టీజర్‌పై అసహనం వ్యక్తం చేశారు. ఉద్దేశపూర్వకంగానే బాలీవుడ్‌ ఇలాంటి వివాదాలు సృష్టిస్తున్నట్లు కనిపిస్తోందన్నారు. ఇతీహాసాలు, చరిత్రపై సినిమా తీయడం నేరం కాదని, అయితే తమ సొంత ప్రయోజనాల కోసం ఉద్దేశపూర్వకంగా వివాదాలు సృష్టించడం సరైనది కాదని ఆయన పేర్కొన్నారు. కాగా అక్టోబర్‌ 2న అయోధ్య వేదికగా ఆదిపురుష్‌ టీజర్‌ విడుదలైన సంగతి తెలిసిందే.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top