Dahanam Movie: దహనం పోస్టర్‌ రిలీజ్‌!

Award Winning Telugu Feature Film Dahanam Poster Released - Sakshi

ఎన్నో అవార్డులు అందుకున్న ఫీచర్ ఫిల్మ్ ‘దహనం’కు సంబంధించిన పోస్టర్‌ రిలీజైంది. ఈ పోస్టర్‌లో ఆదిత్య ఓం ఓల్డ్ గెటప్‌లో ఇది వరకు ఎన్నడూ కనిపించని విధంగా ఉన్నారు. పురాతన ఆలయాన్ని పరిరక్షించే రక్షకుడిగా కనిపిస్తున్నారు. అదారిమూర్తి సాయి తెరకెక్కించిన ఈ చిత్రం ఇది వరకే ఎన్నో జాతీయ వేదికల మీద పలు అవార్డులు అందుకుంది. రెండు బెస్ట్ యాక్టర్ అవార్డులు కూడా వచ్చాయి.

నిర్మాతగానే కాకుండా సంగీత దర్శకుడిగానూ డా.పి సతీష్ కుమార్‌కు మంచి ప్రశంసలు వచ్చాయి. శాంతి చంద్ర, ఎఫ్‌ఎం బాబాయ్ ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ చిత్రం ఎంతో ఆర్టిస్టిక్‌గా ఉన్నా కూడా అంతర్లీనంగా కులాలు, మతాల మీద ప్రశ్నించినట్టుగా ఉంటుంది. అదే అన్ని వర్గాల ప్రేక్షకులను ఆలోచించేలా చేస్తుంది.

చదవండి: రౌడీ హీరోకు ఉంగరం తొడిగి ఏడ్చేసిన మహిళా అభిమాని, వీడియో వైరల్‌
చూపులు కలవకుండానే పెళ్లి చేసుకున్న చిరంజీవి

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top