కేఎల్‌ రాహుల్‌ సెంచరీ.. చీకటి కొన్ని రోజులే అంటూ సినీ నటుల కామెంట్లు

Athiya Shetty Cheers For KL Rahul Hits Century - Sakshi

బాలీవుడ్ నటి అతియా శెట్టి తన భర్త కేఎల్ రాహుల్‌ను అభినందించారు. భారత్‌ చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో జరిగిన ఆసియా కప్ మ్యాచ్‌లో అతని ప్రదర్శనతో, క్రికెటర్ కొత్త రికార్డును నెలకొల్పాడు. క్రికెట్‌లో చాలా రోజులుగా ఫామ్‌ కోల్పోయి జట్టులో అవకాశమే కష్టం అనే స్థితికి చేరిన కేఎల్‌ రాహుల్‌ తిరిగి తనా సత్తా చాటుతూ పాక్‌పై సెంచరీ బాదాడు. దీంతో భర్తపై ప్రశంసల వర్షం కురిపించారు  అథియా శెట్టి.

ఆసియా కప్ 2023 భారత్‌, పాకిస్తాన్ మధ్య జరిగే సూపర్ ఫోర్ మ్యాచ్‌ కోసం ఎందరో ఎదురు చూశారు. ముఖ్యంగా కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లి పాక్‌పై అద్భుత ప్రదర్శన చేశారు. పాకిస్థాన్‌పై వీరిద్దరూ సెంచరీలు సాధించి జట్టుకు గెలుపుతో ఊపునిచ్చారు. తాజాగా అతియా శెట్టి తన జీవిత భాగస్వామి అయిన కేఎల్‌ రాహూల్‌ ఆటతీరుపై ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా ప్రశంసించారు.

'చీకటి కూడా రాత్రి వరకు మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత ముగుస్తుంది. సూర్యుడు తప్పకుండా మళ్లీ ఉదయిస్తాడు. మీరే నాకు సర్వస్వం, నేను నిన్ను ఆరాధిస్తాను. హ్యష్‌టాగ్‌ వన్‌ (#1).' అని ఆమె పోస్ట్‌ చేసింది. ఆమె పోస్ట్‌ చేసిన వెంటనే రాహుల్‌ అభిమానులు రెడ్ హార్ట్ ఎమోజీలతో కామెంట్లు చేస్తున్నారు. ఈ పోస్ట్‌పై స్పందించిన నటుడు అనిల్ కపూర్,వాణి కపూర్ ప్రతిస్పందిస్తూ క్లాప్ ఎమోజీలతో రాహుల్‌ను అభినందించాడు. ఆపై వెంటనే బాలీవుడ్‌ యంగ్‌ హీరో టైగర్ ష్రాఫ్  కూడా రెడ్‌ హార్ట్‌ ఎమోజీలతో స్పందించాడు. డ్రీమ్ గర్ల్ 2 ఫేమ్ ఆయుష్మాన్ ఖురానా ఇలా వ్రాశాడు 'వాట్‌ ఏ కంబ్యాక్' అంటూ పేర్కొన్నాడు.‍

(ఇదీ చదవండి: ఆయన చేసిన తప్పు వల్ల.. నేను ఎంట్రీ ఇచ్చాను: శ్రీకాంత్‌ అడ్డాల)

విరాట్ కోహ్లీ, KL రాహుల్ ఆసియా కప్ చరిత్రలో అత్యధిక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో సూపర్ ఫోర్ మ్యాచ్‌లో ఈ జోడీ 233 పరుగులు చేసి పాకిస్థాన్‌ను చిత్తు చేసింది.

అతియా శెట్టి ఎవరు..?
ప్రముఖ బాలీవుడ్ నటుడు సునీల్‌ శెట్టి ముద్దుల కూతురు అతియా శెట్టి, టీంఇండియా ఓపెనర్ కేఎల్‌ రాహుల్‌తో కొద్దిరోజులుగా డేటింగ్‌లో ఉండి ఈ ఏడాదిలోనే వివాహం చేసుకున్నారు. నిఖిల్ అద్వానీ దర్శకత్వం వహించిన సూరజ్ పంచోలీతో కలిసి 2015లో రొమాంటిక్ యాక్షన్ చిత్రం ‘హీరో’ సినిమాతో అతియా శెట్టి ఎంట్రీ ఇచ్చింది. ఆమె చివరి సారిగా ‘మోతీచూర్ చక్నాచూర్’ చిత్రంలో నవాజుద్దీన్ సిద్ధిఖీ సరసన నటించింది. ఫుట్‌బాల్ క్రీడాకారుడు అఫ్షాన్ ఆషిక్ బయోపిక్ ‘హోప్ సోలో’లో ఆమె ప్రధాన పాత్రలో నటించనుంది. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags:  

Read also in:
Back to Top