క్రైమ్ థ్రిల్లర్‌గా 'అథర్వ'.. క్రేజీ అప్‌డేట్ ఇచ్చిన మేకర్స్! | Atharva Movie Release Date Revealed By Makers In June Month | Sakshi
Sakshi News home page

Atharva Movie: క్రైమ్ థ్రిల్లర్‌గా 'అథర్వ'.. రిలీజ్ ఎప్పుడంటే!

Published Tue, May 2 2023 9:42 PM | Last Updated on Tue, May 2 2023 9:44 PM

Atharva Movie Release Date Revealed By Makers In June Month - Sakshi

యంగ్ హీరో కార్తీక్ రాజు, సిమ్రాన్ చౌదరి, ఐరా ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం 'అథర్వ'. ఈ సినిమాకు మహేష్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. సుభాష్ నూతలపాటి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.  ఇప్పటికే రిలీజైన టైటిల్ లోగో, పోస్టర్‌, టీజర్, ఫస్ట్ లుక్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. 

(ఇద చదవండి: నా ఫస్ట్ క్రష్ అతనే.. యాంకర్ విష్ణుప్రియ షాకింగ్ కామెంట్స్!)

 ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా  పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ప్రస్తుతం చివరి దశలో ఉన్నాయి. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన మేకర్స్ క్రేజీ అప్‌డేట్ ఇచ్చారు. ఈ సినిమాను జూన్‌లో పెద్ద ఎత్తున రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని దర్శక నిర్మాతలు ప్రకటించారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ఈ చిత్రానికి శ్రీచరణ్‌ పాకాల సంగీతాన్ని అందించారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement