థ్రిల్‌ చేస్తా!

Ashish Gandhi-Chitra Shukla new movie shooting at godavari districts - Sakshi

‘నాటకం’ ఫేమ్‌ ఆశిష్‌ గాంధీ, ‘రంగుల రాట్నం’ ఫేమ్‌ చిత్రా శుక్లా జంటగా రాజకుమార్‌ బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం షూటింగ్‌ ఉభయ గోదావరి జిల్లాల్లో జరుగుతోంది. బాబీ ఏడిద క్రియేటివ్‌ వర్క్స్‌ సమర్పణలో బాబీ ఏడిద, రాజేష్‌ బొబ్బూరి నిర్మిస్తున్నారు. నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘ఆసక్తికరమైన ఇన్వెస్టిగేటివ్‌ థ్రిల్లర్‌ ఇది. జనవరి మొదటివారంతో సినిమా పూర్తవుతుంది. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ఇంతవరకు ఎవరూ షూటింగ్‌ చెయ్యని లొకేషన్స్‌లో చేస్తున్నాం. రాజమండ్రిలో పోలీస్‌ స్టేషన్‌ సెట్, కలెక్టర్‌ ఆఫీసు సెట్, ఇన్వెస్టిగేషన్‌ సెట్‌ వేశాం’’ అన్నారు. ఈ చిత్రానికి కథ: బాబీ ఏడిద, రచన: సరదా శ్యామ్, కెమెరా–కూర్పు: హరికృష్ణ, సంగీతం: పి.ఆర్‌ (పెద్దపల్లి రోహిత్‌), సహనిర్మాత: అడ్డాల రాజేష్‌.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top