నానమ్మ మునిమనవళ్లు కావాలంది, నెరవేర్చలేకపోయా: హీరో

Arjun Kapoor: I Cant Fulfill My Grandmother Wish - Sakshi

బాలీవుడ్‌ నటుడు అర్జున్‌ కపూర్‌ తాజాగా నటించిన చిత్రం "సర్దార్‌ కా గ్రాండ్‌సన్‌". ఇందులో నానమ్మ కోరిక తీర్చేందుకు తపనపడే మనవడి పాత్రలో నటించాడు అర్జున్‌. అయితే రియల్‌ లైఫ్‌లో మాత్రం బామ్మ కోరిక నెరవేర్చలేకపోయానని బాధపడుతున్నాడు. తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అర్జున్‌ మాట్లాడుతూ.. "నాకు 26 ఏళ్లు ఉన్నప్పుడు జల్దీ షాదీ కరో బేటా (త్వరగా పెళ్లి చేసుకో బాబు) అంటూ బామ్మ ఓ కోరిక కోరింది. తనకు మునిమనవరాళ్లను ఎత్తుకోవాలని ఉందంటూ తహతహలాడింది. నావరకైతే అది అంత ఈజీ కాదు, నేను దాన్ని సుసాధ్యం చేయలేకపోయాను. కానీ, కపూర్‌ ఫ్యామిలీ త్వరలోనే ఆ కోరిక నెరవేర్చుతుంది" అని చెప్పుకొచ్చాడు.

ఇక తొమ్మిదేళ్ల క్రితం తల్లి తనతో గడిపిన ఆఖరు క్షణాల్లో జరిగిన సంభాషణను సైతం పంచుకున్నాడు. తాను, తన సోదరి అన్షుల స్వతంత్రంగా బతకాలని అమ్మ మరీ మరీ చెప్పిందని, విలువలను కాపాడుతూ మంచి పౌరులుగా ఎదగాలని కోరుకుందని తెలిపాడు. ఈ ప్రక్రియ ఒకచోట ఆగిపోదని, నిరంతరం జరుగుతూ ఉంటుందని పేర్కొన్నాడు. కాగా అర్జున్‌ కపూర్‌ ప్రధాన పాత్రలో నటించిన 'సర్దార్‌ కా గ్రాండ్‌ సన్‌' సినిమా మే 18 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం కానుంది. ఇందులో నీనా గుప్తా నానమ్మ పాత్రలో నటిస్తోంది. అదితి రావు హైదరీ, జాన్‌ అబ్రహాం, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, సోనీ రాజ్‌దాన్‌, కన్వల్జిత్‌ సింగ్‌ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. కాశ్వీ నాయర్‌ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.

చదవండి: హీరోవి నీకేం తక్కువ? నువ్వే కాపాడొచ్చు కదా‌?

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top