ఆస్పత్రిలో చేరిన ప్రముఖ నటుడు | Arjun Bijlani Hospitalised After Severe Stomach Pain | Sakshi
Sakshi News home page

Arjun Bijlani: ఆస్పత్రిలో చేరిన నటుడు.. శస్త్రచికిత్స చేయనున్నారంటూ పోస్ట్‌

Mar 9 2024 1:38 PM | Updated on Mar 9 2024 1:46 PM

Arjun Bijlani Hospitalised After Severe Stomach Pain - Sakshi

హిందీ సీరియల్‌ యాక్టర్‌ అర్జున్‌ బిజ్లానీ అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరాడు. ఈ విషయాన్ని ఇన్‌స్టా వేదికగా తెలియజేస్తూ.. తీవ్రమైన కడుపు నొప్పి కారణంగా ఆసుపత్రిలో చేరాను. వైద్యులు శనివారం శస్త్రచికిత్స చేయనున్నారు. ఏది జరిగినా మన మంచికే’ అంటూ ఆస్పత్రి బెడ్‌పై ఉన్న ఫోటోలను షేర్‌ చేశాడు. నాగిన్‌(తెలుగులో నాగిని) మిలే జబ్ హమ్, తుమ్ వంటి సీరియల్స్ తో బాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు అర్జున్‌.

ఒకవైపు సీరియల్స్‌, మరోవైపు రియాల్టీ షోలల్లో పాల్గొంటూ ఎంతో మంది అభిమానుల్ని సంపాదించుకున్నాడు. తన నటనతో పలు అవార్డులను సొంతం చేసుకున్నారు. నాగిని సీరియల్‌ ద్వారా తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు కూడా చేరువయ్యాడు. అలియా భట్‌, రణ్‌వీర్‌ సింగ్‌ ప్రధాన పాత్రల్లో నటించిన  ‘రాకీ ఔర్‌ రాణి కీ ప్రేమ్‌ కహానీ’ సినిమాలో అతిథి పాత్రలో కనిపించి, తనదైన నటనతో మెప్పించాడు. ప్రస్తుతం పలు వెబ్‌ సిరీస్‌తో పాటు సినిమాల్లోనూ నటిస్తున్నాడు. అర్జున్‌ త్వరగా కోలుకోవాలంటూ అతని ఫ్యాన్స్‌తో పాటు పలువురు నెటిజన్స్‌ కామెంట్స్‌ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement