breaking news
Arjun Bijlani
-
ఆస్పత్రిలో చేరిన ప్రముఖ నటుడు
హిందీ సీరియల్ యాక్టర్ అర్జున్ బిజ్లానీ అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరాడు. ఈ విషయాన్ని ఇన్‌స్టా వేదికగా తెలియజేస్తూ.. తీవ్రమైన కడుపు నొప్పి కారణంగా ఆసుపత్రిలో చేరాను. వైద్యులు శనివారం శస్త్రచికిత్స చేయనున్నారు. ఏది జరిగినా మన మంచికే’ అంటూ ఆస్పత్రి బెడ్‌పై ఉన్న ఫోటోలను షేర్ చేశాడు. నాగిన్(తెలుగులో నాగిని) మిలే జబ్ హమ్, తుమ్ వంటి సీరియల్స్ తో బాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు అర్జున్. ఒకవైపు సీరియల్స్, మరోవైపు రియాల్టీ షోలల్లో పాల్గొంటూ ఎంతో మంది అభిమానుల్ని సంపాదించుకున్నాడు. తన నటనతో పలు అవార్డులను సొంతం చేసుకున్నారు. నాగిని సీరియల్ ద్వారా తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు కూడా చేరువయ్యాడు. అలియా భట్, రణ్వీర్ సింగ్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘రాకీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహానీ’ సినిమాలో అతిథి పాత్రలో కనిపించి, తనదైన నటనతో మెప్పించాడు. ప్రస్తుతం పలు వెబ్ సిరీస్‌తో పాటు సినిమాల్లోనూ నటిస్తున్నాడు. అర్జున్ త్వరగా కోలుకోవాలంటూ అతని ఫ్యాన్స్‌తో పాటు పలువురు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Arjun Bijlani 🧿 (@arjunbijlani) -
టీవీ నటికి గాయం
ముంబై: టీవీ నటి 'నాగిని' ఫేం మౌని రాయ్ గాయపడింది. డాన్స్ రియాలిటీ షో 'ఝలక్ దిఖ్లాజా-9'లో తన ప్రతిభ చాటుకునేందుకు సిద్ధమవుతుండగా ఆమె గాయం బారిన పడింది. స్పెషల్ ఎపిసోడ్ కోసం సహనటుడు అర్జున్ బిజలానీతో కలిసి డాన్స్ చేస్తుండగా ఆమె మెడకు గాయమైంది. 'బాజీరావ్ మస్తానీ' సినిమాలో మల్హారి పాటకు డాన్స్ చేస్తుండగా మౌని రాయ్ గాయపడింది. అక్కడున్నవారు వెంటనే ఆమెకు సఫర్యలు చేశారు. అంతకుముందు ఇదేవిధంగా అర్జున్ బిజలానీ, సిదాంత్ గుప్తా కూడా గాయాలపాయ్యారు. 'ఝలక్ దిఖ్లాజా-9' డాన్స్ రియాలిటీ షో జూలై 30 నుంచి కలర్స్ చానల్ లో ప్రసారం కానుంది. జాక్వెలెస్ ఫెర్నాండెస్, కరణ్ జోహార్, గణేశ్ హెగ్డె న్యాయనిర్ణేతలుగా వ్యవహరించనున్నారు.