మురుగదాస్ పాన్ ఇండియా మూవీ టెటిల్ ఇదే

సామాజిక అంశాలతో కూడిన సినిమాలను తీసేందుకు ఏఆర్ మురుగదాస్ రెడీగా ఉంటారు. ఆయన దర్శకత్వంలో వచ్చిన ‘స్టాలిన్ , తుపాకి, కత్తి, సర్కార్’ వంటి సినిమాలే ఇందుకు నిదర్శనం. తాజాగా ‘1947’ అనే టైటిల్‌తో సినిమాను ప్రకటించారు మురుగదాస్. పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని హిందీ నిర్మాత ఓం ప్రకాశ్‌భట్ నిర్మిస్తారు. ఇప్పటివరకు అయితే ఈ సినిమా బ్యాక్‌డ్రాప్ ఏంటి? నటీనటులు ఎవరు? అనే అంశాలపై స్పష్టత రాలేదు. అయితే టైటిల్‌ను బట్టి ఈ సినిమా చారిత్రక నేపథ్యంలో ఉంటుందని ఊహించవచ్చు.
మరిన్ని వార్తలు :