మళ్లీ టంగ్ స్లిప్ అయిన సుమ.. ఈసారి అలా దొరికిపోయిందిగా! | Sakshi
Sakshi News home page

Anchor Suma: రష్మికను ఆ ప్రశ్న అడిగి దొరికిపోయిన సుమ!

Published Tue, Nov 28 2023 1:58 PM

Anchor Suma Tounge Slip Again in Animal Pre release Event In Hyderabad - Sakshi

బాలీవుడ్‌ హీరో రణ్‌బీర్‌ కపూర్‌, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా జంటగా నటించిన చిత్రం యానిమల్. ఈ చిత్రాన్ని అర్జున్‌ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కించారు. ఇప్పటికే ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్‌ చేశారు. ప్రస్తుతం ట్రైలర్‌ను యూట్యూబ్‌ను షేక్ చేస్తోంది. ఈ ట్రైలర్‌పై సినీ ప్రముఖులు సైతం ప్రశంసలు కురిపించారు. దీంతో ఈ మూవీపై ‍అభిమానుల్లో భారీ అంచనాలు పెంచేశాయి. తాజాగా ఈ మూవీ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్‌ బాబు, దర్శకధీరుడు రాజమౌళి ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు.

అయితే ఈవెంట్‌కు యాంకర్‌గా సుమ వ్యవహరించారు. తన మాటలు, కామెడీ ఆడియన్స్‌లో జోరు తెప్పించే యాంకర్ సుమ ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. అలాగే స్టేజీపై చాలా సందర్భాల్లో సుమ టంగ్ స్లిప్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. తాజాగా జరిగిన యానిమల్ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో మళ్లీ అదే సీన్‌ రిపీట్ అయింది. ఈసారి యాంకర్ సుమ ఎలా దొరికిపోయిందో మీరు చూసేయండి. 

ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో వేదికపై ఉన్న రష్మికకు సుమ ఓ ఆసక్తికర ప్రశ్న వేసింది. మహేశ్ బాబు సర్కారు వారి పాట చిత్రంలోని ఓ సాంగ్‌ను పాడాలని కోరింది. అయితే  మహేశ్, రష్మిక జంటగా నటించిన చిత్రం సరిలేరు నీకెవ్వరు. ఈ చిత్రంలోని 'అబ్బబ్బా అబ్బాయి ఎంత ముద్దుగున్నాడే'.. అనే సాంగ్‌లో 'హీజ్‌ సో క్యూట్‌.. హీజ్‌ సో స్వీట్.. హీజ్‌ సో హ్యాండ్సమ్‌' అంటూ రష్మిక డ్యూయేట్ పాడుతుంది. ఈ సాంగ్‌ అప్పట్లో మంచి క్రేజ్ దక్కించుకుంది. 

అయితే యాంకర్ సుమ మాత్రం సర్కారు వారిపాటలోని ఈ పాటను పాడమంటూ రష్మికను అడిగింది. అయితే దీనిపై నెటిజన్స్ సుమక్కను ట్రోల్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ పాట సరిలేరు నీకెవ్వరు చిత్రంలోనిది కావడంతో నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. అయితే హడావుడిలో సరిలేరు నీకెవ్వరు బదులుగా సర్కారు వారి పాట అనేసి దొరికిపోయింది. ఇటీవలే కన్నడ నటుడు రక్షిత్ శెట్టి సప్త సాగరాలు దాటి సైడ్ బి ఇంటర్వ్యూలో సుమకు ఇలాంటి అనుభవమే ఎదురైంది. రక్షిత్ శెట్టి గురించి ఏ మాత్రం తెలుసుకోకుండా ప్రశ్నలు వేసి దొరికిపోయింది సుమ. అయితే పెద్ద ఈవెంట్ కావడంతో అలా పొరపాటుగా అనేసి ఉంటుందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. 

 
Advertisement
 
Advertisement