Anasuya Bharadwaj: Anchor Shares Emotional Post About Her Father- Sakshi
Sakshi News home page

Anasuya : తండ్రిని గుర్తుచేసుకొని అనసూయ భావోద్వేగం

Dec 16 2021 1:29 PM | Updated on Dec 16 2021 4:23 PM

Anchor Anasuya Shares Emotional Post About Her Father - Sakshi

Anchor Anasuya Shares Emotional Post About Her Father: స్టార్‌ హీరోయిన్లకు సమానమైన క్రేజ్‌ సంపాదించుకున్న యాంకర్లలో అనసూయ ముందుంటుంది. ఓవైపు బుల్లితెరపై అదరగొడుతూనే, మరోవైపు వెండితెరపై కూడా సత్తా చాటుతున్న అనసూయ తండ్రి సుదర్శన్‌ రావు ఇటీవలె కన్నుమూశారు. తాజాగా తండ్రితో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకొని ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్‌ పోస్టును షేర్‌ చేసింది అనసూయ. 'మీరిచ్చిన జీవితానికి ఎలా కృతజ్ఞతలు చెప్పాలో అర్థం కావడం లేదు. మాకు నచ్చిన విధంగా జీవితాన్ని గడిపేలా నేర్పించారు.

ఎలాంటి కష్టం వచ్చినా ధైర్యంగా ఉండమని నేర్పించారు. మాతో మీరు గడిపిన సమయాన్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటాం. అర్థరాత్రులు మీరిచ్చే సర్‌ప్రైజ్‌లను ఎప్పటికీ మర్చిపోలేను. అదంతా మాపై మీకున్న అపరిమితమైన ప్రేమ. నాన్నలా ఎంతో గొప్పగా , ఆదర్శంగా నిలిచారు. ఎప్పటికీ మిమ్మల్ని గర్వపడేలా చేస్తానని మాటిస్తున్నా నాన్న. మీరు వెళ్లిపోయినా ఎప్పటికీ మాతోనే ఉంటారని బలంగా నమ్ముతున్నాను. మీ ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటున్నా' అంటూ అనసూయ తన ఇన్‌స్టాలో రాసుకొచ్చింది. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement