మరింత నవ్వించాలనే ఈ సినిమా చేశాను | Allari Naresh Aa Okkati Adakku Teaser Launch | Sakshi
Sakshi News home page

మరింత నవ్వించాలనే ఈ సినిమా చేశాను

Published Wed, Mar 13 2024 3:35 AM | Last Updated on Wed, Mar 13 2024 3:35 AM

Allari Naresh Aa Okkati Adakku Teaser Launch - Sakshi

‘అల్లరి’ నరేశ్‌

‘‘నాన్నగారి (ఈవీవీ సత్యనారాయణ) ‘ఆ ఒక్కటీ అడక్కు’ సినిమాకి, మా ‘ఆ ఒక్కటీ అడక్కు’ చిత్రానికి ఎటువంటి సంబంధం లేదు. జీవితంలో సెటిల్‌ కాకుండా పెళ్లి చేసుకునే హీరో కథ నాన్నగారి సినిమాలో ఉంటుంది. మా మూవీలో జీవితంలో స్థిరపడినా పెళ్లి కాని హీరో కథ. నా బలం వినోదం. ఈసారి మరింత నవ్వించాలని ‘ఆ ఒక్కటీ అడక్కు’ సినిమా చేశాను’’ అని ‘అల్లరి’ నరేశ్‌ అన్నారు. మల్లి అంకం దర్శకత్వంలో ‘అల్లరి’ నరేశ్, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన చిత్రం ‘ఆ ఒక్కటీ అడక్కు’. రాజీవ్‌ చిలక నిర్మించారు.

భరత్‌ లక్ష్మీపతి సహ నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమా ఈ వేసవిలో విడుదల కానుంది. కాగా ఈ మూవీ టీజర్‌ని హైదరాబాద్‌లో రిలీజ్‌ చేశారు. ఈ వేడుకలో ‘అల్లరి’ నరేశ్‌ మాట్లాడుతూ– ‘‘ఆరోగ్యకరమైన కామెడీ ఉన్న ఎంటర్‌టైనర్‌ ఇది. మల్లిగారు క్లియర్‌ విజన్‌తో ఈ సినిమా తీశారు. రాజీవ్‌గారు ΄్యాషన్‌తో నిర్మించారు’’ అన్నారు. ‘‘నిర్మాత కావాలన్న నా ఇరవై ఏళ్ల కల ఈ సినిమాతో నెరవేరింది’’ అన్నారు రాజీవ్‌ చిలక. ‘‘ఫ్యామిలీతో కలసి ఆనందంగా నవ్వుకుంటూ చూడదగ్గ చిత్రమిది’’ అన్నారు మల్లి అంకం. ‘‘ఈ సినిమాకి డైలాగ్స్‌ రాస్తున్నప్పుడు ఒక కిక్‌ వచ్చింది’’ అన్నారు రచయిత అబ్బూరి రవి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement