ఏడేళ్ల తర్వాత జత కడుతున్న చైతూ, పూజా హెగ్డే! | Akkineni Naga Chaitanya And Pooja Hegde Team Up For Bilingual Film | Sakshi
Sakshi News home page

Naga Chaitanya- Pooja Hegde: 'ఒక లైలా కోసం' కాంబినేషన్‌ రిపీట్‌ కానుందా?!

Published Fri, Feb 18 2022 4:17 AM | Last Updated on Fri, Feb 18 2022 7:54 AM

Akkineni Naga Chaitanya And Pooja Hegde Team Up For Bilingual Film - Sakshi

ఒక్కసారి ఏడేళ్లు వెనక్కి వెళదాం. అప్పుడు వచ్చిన ‘ఒక లైలా కోసం’ సినిమాను గుర్తు చేసుకుందాం. అందులో నాగచైతన్య, పూజా హెగ్డే జంటగా నటించిన విషయం గుర్తుండే ఉంటుంది. పూజ నటించిన తొలి స్ట్రయిట్‌ తెలుగు సినిమా ఇది. అంతకుముందు తమిళ ‘ముగముడి’ తెలుగు అనువాదం ‘మాస్క్‌’లో కనిపించారీ బ్యూటీ. ఇక ఏడేళ్ల క్రితం ‘ఒక లైలా కోసం’లో జోడీగా నటించిన చైతూ–పూజ మరోసారి జోడీ కట్టనున్నారని సమాచారం.

నాగచైతన్య హీరోగా తమిళ దర్శకుడు వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనుందనే వార్త ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో పూజా హెగ్డేని కథానాయికగా అనుకుంటున్నారన్నది తాజా టాక్‌. తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం తెరకెక్కనుందని సమాచారం. మరి.. చైతూ–పూజా మళ్లీ జంటగా కనబడతారా? వెయిట్‌ అండ్‌ సీ.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement