Sakshi News home page

మాటలతో చెప్తే వింటారా? అందుకే ఇలా వెరైటీగా ట్రై చేశారు.. వైరల్‌ వీడియో..

Published Fri, Mar 1 2024 7:15 PM

Air India Release New Inflight Safety Video Titled Safety Mudras Viral On Social Media - Sakshi

నాట్యం అంటే వినోదం.. ఆ వినోదానికి సమాచారం తోడైతే.. అదెలాగో తెలియాలంటే ఈ వార్త చదవాల్సిందే! విమానంలో ప్రయాణించేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఎయిర్‌ ఇండియా వినూత్నంగా తెలిపింది. నాట్యపద్ధతిలో అందరికీ అవగాహన కల్పించే ప్రయత్నం చేసింది . సేఫ్టీ ముద్రాస్‌ పేరిట ఓ వీడియో రిలీజ్‌ చేసింది.

👉 భరతనాట్యం
ఇందులో మొదటగా భరతనాట్యం చేస్తున్న అమ్మాయి సీటుబెల్ట్‌ ఎలా పెట్టుకోవాలో చూపించింది. అలాగే ప్రయాణికులు వారి సామాన్లను ఓవర్‌హెడ్‌ కంపార్ట్‌మెంట్‌లో పెట్టమని సూచించింది.

👉ఒడిస్సి నాట్యం
సీటు ముందు ఉన్న ట్రే టేబుల్స్‌ క్లోజ్‌ చేయమని చెప్తూనే విమానం టేకాఫ్‌ అయ్యేటప్పుడు విండోస్‌ ఓపెన్‌ చేసి ఉంచాలని చెప్పారు.

👉మోహిని నాట్యం 
ప్రయాణికులు ల్యాప్‌టాప్‌ వంటి ఎలక్ట్రానిక్‌ వస్తువులనులను విమానం బయల్దేరేటప్పుడు, కిందకు దిగేటప్పుడు వాడవద్దని సూచించారు. మొబైల్‌ ఫోన్స్‌ ఫ్లైట్‌ మోడ్‌లో వాడుకోవచ్చన్నారు. సిగరెట్స్‌తో పాటు ఇ సిగరెట్స్‌ కూడా వాడటానికి వీల్లేదన్నారు.

👉కథక్‌ నాట్యం
ఎయిర్‌క్రాఫ్ట్‌లో ఎనిమిది ఎమర్జెన్సీ ఎగ్జిట్స్‌ ఉంటాయి. అవి ఎక్కడున్నాయో ఒకసారి చూసుకోండి. దాదాపు మీ వెనకాలే ఓ ఎగ్జిట్‌ ఉండవచ్చు. కొన్ని సందర్భాల్లో ఆక్సిజన్‌ మాస్కులు రిలీజవుతాయి. దాన్ని కచ్చితంగా ధరించాలని నొక్కి చెప్పారు.

👉ఘూమర్‌ నాట్యం
అనుకోని కారణాల వల్ల ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ జరిగితే.. ఎమర్జెన్సీ లైటింగ్‌ మీరు ఎగ్జిట్‌ దగ్గరకు వెళ్లేందుకు సహాయపడుతుందని, దాన్ని గుర్తించాలన్నారు.

👉బిహు నాట్యం
అనుకోకుండా విమానం నీళ్లలో ల్యాండ్‌ అయినప్పుడు సీట్ల కింద లేదా సీట్ల మధ్య ఉన్న రక్షణ కవచాన్ని ధరించాలని తెలిపారు.

👉గిద్ధ నాట్యం
ప్రయాణికులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలిపే సేఫ్టీ కార్డును సీటు పాకెట్‌లో ఉందని, ఏమైనా సందేహాలు ఉంటే దాన్ని తీసి చదవమని విజ్ఞప్తి చేశారు.

ఈ స్పెషల్‌ వీడియోకు శంకర్‌ మహదేవన్‌ సంగీతం అందించగా ప్రసూన్‌ జోషి గేయ రచయితగా పని చేశారు. దీనికి భారత్‌బాలా దర్శకత్వం వహించారు.

Advertisement

What’s your opinion

Advertisement