సుశాంత్‌ విసెరాను సరిగా భద్రపరచలేదు

AIIMS Forensic Department Says Sushant Viscera Not Preserved Properly - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: బాలీవుడ్‌ దివంగత నటుడు సుశాంత్‌సింగ్‌ రాజ్‌పుత్‌ మృతికి సంబంధించిన కేసులో మరో కీలక విషయం వెలుగు చూసింది. సుశాంత్‌ మృతదేహం నుంచి సేకరించిన కీలమైన అవయవాలు(విసెరా‌) సంబంధించి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్‌) ఫోరెన్సిక్ బృందం పలు అనుమానాలను వ్యక్తం చేసింది. అదే విధంగా అవయవాల (విసెరా)ను సరిగా భద్రపరచలేదని తెలిపింది. ఎయిమ్స్ ఫోరెన్సిక్ మెడిసిన్‌, టాక్సికాలజీ విభాగానికి అందిన విసెరా చాలా తక్కువ పరిమాణంలో ఉందని, కొంత మేరకు క్షీణించిందని అధికారులు తెలిపారు. (సస్పెన్స్‌‌ థ్రిల్లర్‌కు ఏమాత్రం తీసిపోని కేసు)

ఎయిమ్స్ బృందం ఆదివారం సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిట్‌)ను కలువనుంది. ఎయిమ్స్‌ బృందం సుశాంత్‌కి సంబంధించిన పలు నివేదికలు సిట్‌కి అందించనున్నారు. సుశాంత్‌ మృతికి గల కారణాన్ని నిర్ధారించడంలో కీలకమైన విసెరాను శుక్రవారం ఎయిమ్స్‌ ఫోరెన్సిక్‌ బృందం పరీక్షించింది. అయితే సుశాంత్‌ అవయవాల (విసెరా) క్షీణించిందని, దాని వల్ల రసాయన, టాక్సికాలజికల్‌ విశ్లేషణ చేయడం కష్టతరంగా మారిందని ఎయిమ్స్‌ అధికారులు పేర్కొన్నారు. జూన్ 14న సుశాంత్ తన ముంబై ఇంటిలో ఉరివేసుకుని చనిపోయిన విషయం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. సుశాంత​ మృతిపై పలు అనుమానాలు వ్యక్తం కావటంతో సీబీఐ విచారణ జరుపుతోంది. (కరణ్‌ జోహార్‌ డ్రగ్‌ పార్టీపై ఎన్‌సీబీ కన్ను)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top