Bappi Lahiri-Adah Sharma: Actres Getting Trolled For Comparing Herself With Bappi Lahiri - Sakshi
Sakshi News home page

Adah Sharma: మరీ ఇలా దిగజారుతావా? అదా శర్మపై దారుణమైన ట్రోలింగ్‌!

Feb 25 2022 12:41 PM | Updated on Feb 25 2022 1:14 PM

Adah Sharma Getting Trolled For Comparing Herself With Bappi Lahiri - Sakshi

లెజెండ్‌ ఎప్పటికీ లెజెండే, నువ్వు కనీసం ఆయన దరిదాపుల్లోకి కూడా వెళ్లలేవు. భౌతికంగా ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్లిపోయిన వ్యక్తితో నిన్ను నువ్వు పోల్చుకుంటున్నావా? సరదా కోసం మరీ ఇలా దిగజారుతావా, ఛీ, నీమీద ఉన్న గౌరవమంతా పోయింది అంటూ అదాను ఏకిపారేస్తున్నారు...

Adah Sharma Trolled By Netizens: హార్ట్‌ ఎటాక్‌ హీరోయిన్‌ అదా శర్మ చేసిన పనికి నెటిజన్లు ఆమెను దుమ్మెత్తిపోస్తున్నారు. కొంచెమైనా బుద్ధుండక్కర్లేదా? నువ్వు ఫేమస్‌ అవడం కోసం ఏదైనా చేస్తావా? అని దుయ్యబడుతున్నారు. ఇంతకీ అందరూ ఆగ్రహించేలా ఆమె ఏం చేసిందంటే... అదా శర్మ ఫేస్‌బుక్‌లో బప్పి లహరి ఫొటో పక్కన తన ఫొటోను జోడించింది. ఇందులో ఒంటి నిండా బంగారు నగలు ధరించి, వేళ్లకు ఉంగరాలు తొడుక్కుని బప్పి లహరి స్టైల్‌లో ఫొటోకు పోజిచ్చింది. అంతేకాదు, ఎవరి ఫొటో బాగుంది? అని అర్థం వచ్చేలా ఓ క్యాప్షన్‌ జోడించింది.

ఇది చూసిన నెటిజన్లు అంత పెద్ద సింగర్‌తో నీకు పోలికేంటి? అని ప్రశ్నిస్తున్నారు. 'లెజెండ్‌ ఎప్పటికీ లెజెండే, నువ్వు కనీసం ఆయన దరిదాపుల్లోకి కూడా వెళ్లలేవు', 'భౌతికంగా ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్లిపోయిన వ్యక్తితో నిన్ను నువ్వు పోల్చుకుంటున్నావా?, నీ సరదాల కోసం మరీ ఇలా దిగజారుతావా?', 'ఛీ, నీమీద ఉన్న గౌరవమంతా పోయింది' అంటూ అదాను ఏకిపారేస్తున్నారు.

కాగా గ్రేట్‌ సింగర్‌, మ్యూజిక్‌ డైరెక్టర్‌ బప్పి లహరి ఫిబ్రవరి 16న మరణించారు. ఈయన అటు బాలీవుడ్‌లో, ఇటు సౌత్‌లో ముఖ్యంగా తెలుగు తమిళం, కన్నడ పరిశ్రమలో లెజెండరీ మ్యూజిక్‌ డైరెక్టర్‌గా, సింగర్‌గా అభిమానుల గుండెల్లో  గూడు కట్టుకున్నారు. 'ఆకాశములో ఒక తార', 'రాధా రాధా మదిలోన మన్మథ బాధ', 'భద్రాచలం కొండ', 'వానా వానా వెల్లువాయే', 'చిలుకా క్షేమమా', 'మావా మావా మావా..' వంటి ఎన్నో హిట్‌ సాంగ్స్‌ ఆయన సంగీతం అందించినవే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement