గ‌ట్టిగా అరిస్తే అన్నీనిజాలు అయిపోతాయా ?

Actress Urmila Matondkar Has Lashed Out At Kangana Ranaut  - Sakshi

ముంబై :  కంగ‌నా ర‌నౌత్ కావాల‌నే త‌నేదో బాధితురాలు అన్న‌ట్లు డ్రామాలాడుతుంద‌ని  కాంగ్రెస్ నాయ‌కురాలు, రంగీలా ఫేమ్ ఉర్మిలా మటోండ్కర్ మండిప‌డ్డారు. ముంబైపై అనుచిత వ్యాఖ్య‌లు చేసిన కంగ‌నా.. త‌న స్వ‌స్థ‌లం హిమాచ‌ల్‌ప్ర‌దేశ్ మాద‌క‌ద్ర‌వ్యాలకు మూలం అన్న సంగ‌తి తెలుసుకోవాల‌ని హిత‌వు ప‌లికారు. బాలీవుడ్‌లో డ్ర‌గ్స్ మాఫియా అంటూ విరుచుకుప‌డుతున్న కంగ‌నా మొద‌ట త‌న పోరాటాన్ని సొంత రాష్ర్టం నుంచే ప్రారంభించాల‌ని తెలిపారు. పెద్ద‌గా నోరేసుకొని మాట్లాడినంత మాత్రానా ఆమె మాట్లాడేవ‌న్నీ నిజాలు అయిపోవ‌ని ఫైర్ అయ్యారు. ప్ర‌జ‌ల ట్యాక్స్ డ‌బ్బుల‌తో  వై-ప్ల‌స్ క్యాట‌గిరీ అనుభ‌విస్తున్న కంగ‌నా  డ్ర‌గ్స్ గురించి తెలిసిన వెంట‌నే పోలీసుల‌కు ఎందుకు స‌మాచారం ఇవ్వ‌లేదంటూ ప్రశ్నించారు. (అందుకే నాపై కక్ష గట్టారు.. చూద్దాం: కంగన)

అది విఫ‌ల‌మైతే విమెన్ కార్డు తీస్తారు
పబ్లిసిటీ కోస‌మో, స్వార్థ  ప్ర‌యోజ‌నాల కోస‌మో ముంబైని కించ‌ప‌రిచేలా మాట్లాడితే త‌ను స‌హించ‌బోన‌ని  హెచ్చ‌రించారు. కంగ‌నా వ్యాఖ్య‌లు ముంబై ప్ర‌జ‌ల‌ను అవ‌మానించేలా ఉన్నాయ‌ని దుయ్య‌బ‌ట్టారు. అంతేకాకుండా కొంద‌రు ఎప్ప‌టిక‌ప్ప‌డు బాధితురాలు అన్న‌ట్లు డ్రామాలాడుతారు. అవి విఫ‌ల‌మైతే మ‌హిళా హ‌క్కులు అంటూ విమెన్  కార్డు ఉప‌యోగిస్తారు అంటూ కంగ‌నా గురించి ప‌రోక్షంగా వ్యాఖ్య‌లు చేశారు.

ఇక జ‌య‌బ‌చ్చ‌న్‌పై  కంగ‌నా వ్యాఖ్య‌లు ఎంత‌మాత్రం ఆమెద‌యోగ్యం కాద‌ని,  ఓ సాంప్ర‌దాయ కుటుంబానికి చెందిన ఎవ‌రూ ఇలాంటి వ్యాఖ్య‌లు చేయ‌ర‌ని ఊర్మిళ అన్నారు. బాలీవుడ్ గురించి ఇంత పెద్ద చ‌ర్చ జ‌రుగుతున్నా నిజ‌నిజాలు మాట్లాడితే త‌మ‌కు ఎక్క‌డ స‌మ‌స్య‌లు వ‌స్తాయో అని బీటౌన్ ఇండస్ర్టీ సైలంట్‌గా ఉంద‌ని తెలిపారు. కుల‌త‌త్వాన్ని ప్ర‌శ్నించిన డాక్ట‌ర్ పాయ‌ల్ త‌ద్వి ఆత్మ‌హ‌త్య గురించి ఎవ‌రూ మాట్లాడ‌ట్లేదని, సుశాంత్ మ‌ర‌ణాన్ని  కేవ‌లం రాజ‌కీయం కోసం వాడుకోవాల‌ని చూస్తున్నార‌ని దుయ్య‌బ‌ట్టారు. (అభిషేక్‌ ఆత్మహత్య చేసుకుంటే ఏమంటారు: కంగనా)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top