Taapsee Pannu: వారిలా నటించడం నాకు తెలీదు: తాప్సీ

Actress Tapsee Pannu Reaction On personal boundaries In Interviews - Sakshi

కొందరిలా కెమెరాల ముందు తనకు నటించడం రాదని నటి తాప్సీ పన్ను షాకింగ్‌ చేశారు. కెమెరా ముందు ఒకలా.. వెనుక మరోలా చేయడం తనకు చేతకాదని.. తానెప్పుడూ నిజాయితీగానే ఉంటానని స్పష్టం చేశారు. అయితే ఇటీవల విలేకర్లపై నేను ఆగ్రహం వ్యక్తం చేసిన పలు వీడియోలు నెట్టింట వైరల్‌గా మారడంపై ఆమె స్పందించారు.

తాప్సీ మాట్లాడుతూ.. 'వాటిని చూసి చాలామంది నాపై విమర్శలు చేశారు. సోషల్‌మీడియాలోనూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు.వాళ్ల మాటల వల్ల నేనెంతో బాధపడ్డాను. సోషల్‌ మీడియాకు దూరంగా ఉండాలనుకున్నా. నాపై వచ్చే వార్తల గురించి వెతకకూడదని నిర్ణయించుకున్నా. నాకు నచ్చిన విధంగా ఉంటా. ఎక్కడైనా నా మనసుకు నచ్చింది మనస్ఫూర్తిగా మాట్లాడతా. సమాజంలో మంచి మార్కులు కొట్టేయడానికి కొంతమంది స్టార్స్‌ బయట నటిస్తుంటారు. అలాంటి వారి గురించి నిజాలు బయటకు వచ్చినప్పుడు ప్రజల్లో వారి గౌరవం దెబ్బ తింటుంది. అందరికీ నేను నచ్చాలని లేదు. నటిగా నా పని మెచ్చుకుంటే చాలు.' అని అన్నారు.

బాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు నటి తాప్సీ. ఇటీవల ‘దోబారా’ ప్రమోషన్స్‌లో పాల్గొన్న ఆమె విలేకర్లు అడిగిన ప్రశ్నల పట్ల అసహనం వ్యక్తం చేశారు. మరో ఇంటర్వ్యూలోనూ ఆమె అదే విధంగా మాట్లాడారు. దీంతో ఈ వీడియోలు చూసిన నెటిజన్లు.. తాప్సీకి పొగరెక్కువ అంటూ కామెంట్స్ చేశారు. కాగా.. ఇటీవల బ్లర్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది ముద్దుగుమ్మ. తాప్సీకి వచ్చే ఏడాది కొన్ని భారీ ప్రాజెక్ట్‌లు ఉన్నాయి. ఆమె షారుఖ్ ఖాన్‌తో అతని తదుపరి చిత్రం డుంకీలో కనిపించనుంది. ఆ తర్వాత వో లడ్కీ హై కహాన్‌లో కూడా నటిస్తోంది. 

 

మరిన్ని వార్తలు :

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top